6 FA 4 MODEL PAPER ANSWERS

Answer Key: Science Model Paper (2025-26) - Electricity and Circuits

Section A: Multiple Choice Questions (15 x 1 = 15 Marks)

1. What provides electricity to the bulb in a torch? (టార్చ్ లోని బల్బుకు విద్యుత్తును ఏది అందిస్తుంది?)


A) Power station (పవర్ స్టేషన్)

B) Electric cell (విద్యుత్ ఘటము) 

C) Solar panel (సౌర ఫలకం)

D) Magnet (అయస్కాంతం)

Answer: B


2. The metal cap on an electric cell is which terminal? (విద్యుత్ ఘటంపై ఉండే లోహపు మూత ఏ ధ్రువం?)


A) Negative terminal (ఋణ ధృవం)

B) Positive terminal (ధన ధృవం) 

C) Neutral terminal (తటస్థ ధృవం)

D) Both A and B

Answer: B


3. What is the thin wire inside the glass bulb that gives off light called? (కాంతిని ఇచ్చే బల్బ్ లోపలి సన్నని తీగను ఏమంటారు?)


A) Terminal (ధృవం)

B) Metal tip (లోహపు కొన)

C) Filament (ఫిలమెంట్) 

D) Switch (స్విచ్)

Answer: C


4. An electric cell stops producing electricity when: (విద్యుత్ ఘటము విద్యుత్ ఉత్పత్తిని ఎప్పుడు నిలిపివేస్తుంది?)

A) The glass breaks (గాజు పగిలినప్పుడు)

B) It is switched off (స్విచ్ ఆపేసినప్పుడు)

C) Chemicals are used up (రసాయనాలు పూర్తిగా ఉపయోగించినప్పుడు) 

D) It is kept in the dark (చీకటిలో ఉంచినప్పుడు)

Answer: C


5. How many terminals does an electric bulb have? (ఒక విద్యుత్ బల్బ్ కు ఎన్ని ధృవాలు ఉంటాయి?)


A) One (ఒకటి)

B) Two (రెండు) 

C) Three (మూడు)

D) Four (నాలుగు)

Answer: B


6. In an electric circuit, what is the direction of current? (విద్యుత్ వలయములో విద్యుత్ ప్రవాహ దిశ ఏది?)


A) Negative to Positive (- నుండి +)

B) Positive to Negative (+ నుండి -) 

C) Negative to Negative (- నుండి -)

D) None of these

Answer: B


7. A bulb does not light up if it is "fused". This usually means: (బల్బ్ "మాడిపోయినప్పుడు" వెలగదు. అంటే సాధారణంగా జరిగేది ఏమిటి?)


A) The glass is dirty (గాజు మురికిగా ఉంది)

B) The filament is broken (ఫిలమెంట్ తెగిపోయింది) 

C) The cell is new (ఘటం కొత్తది)

D) The wires are thick (తీగలు మందంగా ఉన్నాయి)

Answer: B


8. Which of the following is a simple device used to break or complete a circuit? (వలయమును తెరవడానికి లేదా మూసివేయడానికి ఉపయోగించే సరళమైన పరికరం ఏది?)


A) Filament (ఫిలమెంట్)

B) Switch (స్విచ్) 

C) Insulator (బంధకం)

D) Conductor (వాహకం)

Answer: B


9. Materials that allow electric current to pass through them are called: (తమ గుండా విద్యుత్ని ప్రవహింపచేసే పదార్థాలను ఏమంటారు?)


A) Insulators (విద్యుత్ బంధకాలు)

B) Reflectors (పరావర్తకాలు)

C) Conductors (విద్యుత్ వాహకాలు) 

D) Filaments (ఫిలమెంట్లు)

Answer: C


10. Why are rubber gloves used by electricians? (ఎలక్ట్రీషియన్లు రబ్బరు గ్లోవ్స్ ఎందుకు ఉపయోగిస్తారు?)


A) To keep hands clean (చేతులు శుభ్రంగా ఉంచడానికి)

B) Rubber is a conductor (రబ్బరు ఒక వాహకం)

C) Rubber is an insulator (రబ్బరు ఒక విద్యుత్ బంధకం) 

D) To make work easy (పనిని సులభతరం చేయడానికి)

Answer: C


11. Which of these materials is an insulator? (కింది వానిలో ఏది విద్యుత్ బంధకం?)


A) Iron nail (ఇనుప మేకు)

B) Eraser (రబ్బరు) 

C) Key (తాళం చెవి)

D) Copper wire (రాగి తీగ)

Answer: B


12. What happens if you join the two terminals of a cell directly without a bulb? (బల్బ్ లేకుండా ఘటం యొక్క రెండు కొనలను నేరుగా కలిపితే ఏమవుతుంది?)


A) The bulb glows brighter (బల్బ్ ప్రకాశవంతంగా వెలుగుతుంది)

B) The chemicals get used up very fast (రసాయనాలు త్వరగా ఖర్చవుతాయి) 

C) The cell charges up (ఘటం చార్జ్ అవుతుంది)

D) Nothing happens (ఏమీ జరగదు)

Answer: B


13. Which part of the torch bulb is connected to the metal case at its base? (టార్చ్ బల్బ్ లోని ఏ భాగం దాని అడుగున ఉన్న లోహపు తొడుగుకు అనుసంధానించబడి ఉంటుంది?)


A) One of the thick wires (ఒక మందపాటి తీగ) 

B) The glass case (గాజు తొడుగు)

C) The switch (స్విచ్)

D) The plastic casing (ప్లాస్టిక్ రక్షకం)

Answer: A


14. An electric circuit provides a __________ path for electricity to pass. (విద్యుత్ ప్రవహించడానికి విద్యుత్ వలయము ఒక __________ మార్గాన్ని అందిస్తుంది.)


A) Broken (తెగిపోయిన)

B) Incomplete (అసంపూర్ణ)

C) Complete (పూర్తి) 

D) Curved (వక్ర)

Answer: C


15. Is our human body a conductor or an insulator? (మన మానవ శరీరం విద్యుత్ వాహకమా లేదా బంధకమా?)



A) Conductor (వాహకము) 

B) Insulator (బంధకము)

C) Both (రెండూ)

D) Neither (ఏదీ కాదు)

Answer: A


Section B: Short Answer Questions (2 x 2 = 4 Marks)

 

16. What is the purpose of using an electric switch? (విద్యుత్ స్విచ్ ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఏమిటి?)

A switch is a simple device that is used to either break the electric circuit or to complete it. It allows us to turn electrical appliances like bulbs, fans, or torches on or off as needed.

: స్విచ్ అనేది విద్యుత్ వలయాన్ని తెరవడానికి (break) లేదా మూసివేయడానికి (complete) ఉపయోగించే ఒక సాధారణ పరికరం. దీని ద్వారా మనకు అవసరమైనప్పుడు బల్బులు లేదా ఇతర విద్యుత్ పరికరాలను ఆన్ (on) లేదా ఆఫ్ (off) చేసుకోవచ్చు.


 

17. Why should we never join the two terminals of an electric cell directly? (విద్యుత్ ఘటం యొక్క రెండు కొనలను మనం ఎందుకు నేరుగా కలపకూడదు?)

One should never join the two terminals of an electric cell without connecting them through a switch and a device like a bulb. If this is done, the chemicals in the electric cell get used up very fast and the cell stops working.

విద్యుత్ ఘటం యొక్క రెండు కొనలను స్విచ్ లేదా బల్బు వంటి పరికరాలు లేకుండా నేరుగా కలపరాదు. అలా చేస్తే, విద్యుత్ ఘటంలోని రసాయనాలు చాలా త్వరగా వినియోగించబడి, ఘటం పనిచేయడం ఆగిపోతుంది.


 Section C: Data & Diagram Based Questions

2 x 4 = 8 Marks

18. Look at the diagram and identify the parts of the electric cell. 

(పటాన్ని చూసి విద్యుత్ ఘటం యొక్క భాగాలను గుర్తించండి.)

(i) Part A (Metal Cap): Positive terminal (+).

o ధన ధృవం (+).

(ii) Part B (Metal Disc): Negative terminal (-).

o ఋణ ధృవం (-).

(iii) What is stored inside the cell to produce electricity? 

An electric cell produces electricity from the chemicals stored inside it.

విద్యుత్ ఘటము దాని లోపల నిల్వ చేయబడిన రసాయనాల నుండి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.


 

19. Draw a simple electric circuit showing a bulb, a cell, and a switch in the 'ON' position. Explain when the bulb glows. 

(బల్బ్, ఘటం మరియు 'ఆన్' స్థితిలో ఉన్న స్విచ్ ను చూపుతూ ఒక సరళ విద్యుత్ వలయాన్ని గీయండి. బల్బ్ ఎప్పుడు వెలుగుతుందో వివరించండి.)

Explanation 

o An electric circuit provides a complete path for electricity to pass between the two terminals of the electric cell.

o The bulb glows only when the switch is in the 'ON' position, which completes the circuit and allows current to flow through the filament.

వివరణ 

o విద్యుత్ వలయము అనేది విద్యుత్ ఘటం యొక్క రెండు ధృవాల మధ్య విద్యుత్ ప్రవహించడానికి పూర్తి మార్గాన్ని అందిస్తుంది.

o స్విచ్ 'ఆన్' స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే వలయం పూర్తవుతుంది, దీనివల్ల ఫిలమెంట్ గుండా విద్యుత్ ప్రవహించి బల్బు వెలుగుతుంది.

 

Section D: Long Answer Question (1 x 8 = 8 Marks)

 

20. A) (i) Using the "conduction tester" on an object it was found that the bulb begins to glow. Is that object a conductor or an insulator? Explain. 

("టెస్టర్ వలయము” నందు ఒక పదార్ధమును అనుసంధానించినట్లయితే బల్బ్ వెలుగుతున్నట్లు కనుగొనబడింది. ఆ వస్తువు వాహకమా లేదా బంధకమూ? వివరించండి)

o The object is a conductor.

o This is because the bulb glows only when electric current passes through the circuit.

o Materials that allow electric current to pass through them are called conductors of electricity.

o ఆ వస్తువు విద్యుత్ వాహకము.

o ఎందుకంటే వలయం గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు మాత్రమే బల్బు వెలుగుతుంది.

o ఏ పదార్థాలు తమ గుండా విద్యుత్ని ప్రవహింపచేస్తాయో వాటిని విద్యుత్ వాహకాలు అంటారు.

(ii) The handles of the tools like screwdrivers and pliers used by electricians for repair work usually have plastic or rubber covers on them. Can you explain why? 

(మరమ్మత్తు పని కోసం ఎలక్ట్రిషియన్లు ఉపయోగించే స్క్రూడ్రైవర్లు మరియు శ్రావణం వంటి సాధనాల పిడులపై సాధారణంగా ప్లాస్టిక్ లేదా రబ్బరు తొడుగులు ఉంటాయి. ఎందుకో వివరించగలరా?)

o Rubber and plastics are insulators, which means they do not allow electric current to pass through them.

o The human body is a conductor of electricity.

o These covers are used to protect the electrician from electric shocks while handling electrical appliances.

o రబ్బరు మరియు ప్లాస్టిక్ అనేవి విద్యుత్ బంధకాలు, ఇవి తమ గుండా విద్యుత్ ప్రవహించనివ్వవు.

o మానవ శరీరం ఒక మంచి విద్యుత్ వాహకము.

o విద్యుత్ ఉపకరణాలతో పనిచేస్తున్నప్పుడు విద్యుత్ షాక్ తగలకుండా రక్షణ కోసం ఈ తొడుగులను ఉపయోగిస్తారు.


OR (లేదా)

20. B) (i) Define Conductors and Insulators. (విద్యుత్ వాహకాలు మరియు బంధకాలను నిర్వచించండి)

o Conductors: Materials that allow electric current to pass through them are called conductors.

o Insulators: Materials that do not allow electric current to pass through them are called insulators.

o విద్యుత్ వాహకాలు: ఏ పదార్థాలు తమ గుండా విద్యుత్ని ప్రవహింపచేస్తాయో వాటిని విద్యుత్ వాహకాలు అంటారు.

o విద్యుత్ బంధకాలు: ఏ పదార్థాలు తమ గుండా విద్యుత్ని ప్రవహింపచేయవో వాటిని విద్యుత్ బంధకాలు అంటారు.

(ii) Identify the following materials as Conductors or Insulators: (కింది పదార్థాలను వాహకాలు లేదా బంధకాలుగా గుర్తించండి:)

(a) Key (తాళం చెవి): Conductor (వాహకము).

(b) Eraser (రబ్బరు): Insulator (బంధకము).

(c) Glass bangle (గాజు): Insulator (బంధకము).

(d) Iron nail (ఇనుప మేకు): Conductor (వాహకము).

(iii) Explain why tools used by electricians have plastic or rubber handles. (ఎలక్ట్రీషియన్లు ఉపయోగించే సాధనాల పిడులకు ప్లాస్టిక్ లేదా రబ్బరు తొడుగులు ఎందుకు ఉంటాయో వివరించండి)

o Rubber and plastics are insulators, which means they do not allow electric current to pass through them.

o The human body is a conductor of electricity.

o These covers are used to protect the electrician from electric shocks while handling electrical appliances.

o రబ్బరు మరియు ప్లాస్టిక్ అనేవి విద్యుత్ బంధకాలు, ఇవి తమ గుండా విద్యుత్ ప్రవహించనివ్వవు.

o మానవ శరీరం ఒక మంచి విద్యుత్ వాహకము.

o విద్యుత్ ఉపకరణాలతో పనిచేస్తున్నప్పుడు విద్యుత్ షాక్ తగలకుండా రక్షణ కోసం ఈ తొడుగులను ఉపయోగిస్తారు.