Self Assessment Model Paper - 4 (2025-26) Class: 8 Answer key

 

Section A: Multiple Choice Questions (15 x 1 = 15 Marks)

1. Which of the following is a major threat to the survival of organisms today?

నేడు జీవుల మనుగడకు ప్రధాన ముప్పు ఏది?

    • A) Reforestation (అడవుల పునరుద్ధరణ)
    • B) Deforestation (అటవీ నిర్మూలన)
    • C) Recycling (రీ సైక్లింగ్)
    • D) Biosphere Reserves (జీవావరణ రిజర్వ్ లు)
    • Answer: B

2. Deforestation increases the level of which gas in the atmosphere?

అటవీ నిర్మూలన వాతావరణంలో ఏ వాయువు స్థాయిని పెంచుతుంది?

    • A) Oxygen (ఆక్సిజన్)
    • B) Nitrogen (నైట్రోజన్)
    • C) Carbon dioxide ($CO_2$) (కార్బన్ డై ఆక్సైడ్)
    • D) Hydrogen (హైడ్రోజన్)
    • Answer: C

3. The conversion of fertile land into deserts is called:

సారవంతమైన భూమి ఎడారిగా మారడాన్ని ఏమంటారు?

    • A) Deforestation (అటవీ నిర్మూలన)
    • B) Reforestation (అడవుల పునరుద్ధరణ)
    • C) Desertification (ఎడారీకరణం)
    • D) Infiltration (నీరు ఇంకుదల)
    • Answer: C

4. Which place was selected by Professor Ahmad as a unique biosphere reserve?

ప్రొఫెసర్ అహ్మద్ ఏ ప్రదేశాన్ని ఒక ప్రత్యేకమైన జీవావరణ రిజర్వ్ గా ఎంచుకున్నారు?

    • A) Bharatpur (భరత్ పూర్)
    • B) Kaziranga (కాజీరంగా)
    • C) Pachmarhi (పచ్మర్హి)
    • D) Satpura (సాత్పురా)
    • Answer: C

5. Plants found in a particular area are termed as:

నిర్దిష్ట ప్రాంతంలో కనిపించే మొక్కలను ఏమంటారు?

    • A) Fauna (జంతుజాలం)
    • B) Flora (వృక్షజాలం)
    • C) Endemic (ఎండమిక్)
    • D) Species (జాతి)
    • Answer: B

6. Which of these is an example of endemic fauna in the Pachmarhi Biosphere Reserve?

పచ్మర్హి జీవావరణ రిజర్వ్ లోని ఎండమిక్ జంతుజాలానికి ఉదాహరణ ఏది?

    • A) Blue-bull (నీలి ఎద్దు)
    • B) Leopard (చిరుతపులి)
    • C) Giant squirrel (పెద్ద ఉడుత)
    • D) Wolf (తోడేలు)
    • Answer: C

7. The source book that keeps a record of all endangered animals and plants is:

అన్ని అంతరించిపోతున్న జంతువులు మరియు మొక్కల రికార్డును కలిగి ఉన్న పుస్తకం:

    • A) Green Data Book
    • B) Blue Data Book
    • C) Red Data Book
    • D) Yellow Data Book
    • Answer: C

8. "Project Tiger" was launched to:

"ప్రాజెక్ట్ టైగర్" దేని కోసం ప్రారంభించబడింది?

    • A) Capture tigers (పులులను పట్టుకోవడం)
    • B) Export tigers (పులులను ఎగుమతి చేయడం)
    • C) Ensure the survival and maintenance of tigers (పులుల మనుగడను నిర్ధారించడం)
    • D) Hunt tigers (పులులను వేటాడటం)
    • Answer: C

9. Migratory birds fly to far away areas primarily to:

వలస పక్షులు ప్రధానంగా దేని కోసం సుదూర ప్రాంతాలకు ఎగురుతాయి?

    • A) Find food (ఆహారం కోసం)
    • B) Escape from predators (శత్రువుల నుండి తప్పించుకోవడానికి)
    • C) Lay eggs (గుడ్లు పెట్టడానికి)
    • D) Play (ఆడుకోవడానికి)
    • Answer: C

10. What is the process of restocking destroyed forests by planting new trees?

నాశనం చేయబడిన అడవుల స్థానంలో కొత్త మొక్కలను నాటే ప్రక్రియను ఏమంటారు?

    • A) Deforestation (అటవీ నిర్మూలన)
    • B) Reforestation (అడవుల పునరుద్ధరణ)
    • C) Cultivation (సాగు చేయడం)
    • D) Poaching (వేటాడటం)
    • Answer: B

11. Species that are facing the danger of extinction are known as:

అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జాతులను ఏమంటారు?

    • A) Extinct species (అంతరించిపోయిన జాతులు)
    • B) Endemic species (ఎండమిక్ జాతులు)
    • C) Endangered species (ఆపదలో ఉన్న జాతులు)
    • D) Native species (స్థానిక జాతులు)
    • Answer: C

12. Which of the following is a natural cause of deforestation?

కింది వాటిలో అటవీ నిర్మూలనకు సహజ కారణం ఏది?

    • A) Building houses (ఇళ్లు నిర్మించడం)
    • B) Making furniture (ఫర్నిచర్ తయారు చేయడం)
    • C) Severe droughts (తీవ్రమైన కరువులు)
    • D) Cultivation (సాగు చేయడం)
    • Answer: C

13. The Satpura National Park preserves:

సాత్పురా జాతీయ ఉద్యానవనం వేటిని భద్రపరుస్తుంది?

    • A) Flora and Fauna (వృక్ష మరియు జంతుజాలం)
    • B) Landscape (ప్రకృతి దృశ్యం)
    • C) Historic objects (చారిత్రక వస్తువులు)
    • D) All of the above (పైవన్నీ)
    • Answer: D

14. Siberian cranes migrate to India from:

సైబీరియన్ కొంగలు భారతదేశానికి ఎక్కడి నుండి వలస వస్తాయి?

    • A) Africa (ఆఫ్రికా)
    • B) Russia (రష్యా)
    • C) Australia (ఆస్ట్రేలియా)
    • D) USA (అమెరికా)
    • Answer: B

15. How many full-grown trees are needed to make one tonne of paper?

ఒక టన్ను కాగితం తయారు చేయడానికి ఎన్ని పెరిగిన వృక్షాలు అవసరమవుతాయి?

    • A) 10
    • B) 17
    • C) 25
    • D) 50
    • Answer: B

 

Section B: Very Short Answer Questions (2 x 2 = 4 Marks)

16. What is the difference between Flora and Fauna?

వృక్షజాలం మరియు జంతుజాలం మధ్య తేడా ఏమిటి?

    • Answer : Plants found in a particular area are termed as Flora, while animals found in that area are termed as Fauna.
    • సమాధానం : ఒక నిర్దిష్ట ప్రాంతంలో కనిపించే మొక్కలను వృక్షజాలం (Flora) అని, అదే ప్రాంతంలో కనిపించే జంతువులను జంతుజాలం (Fauna) అని అంటారు.

17. Why is global warming caused by deforestation?

అటవీ నిర్మూలన వల్ల భూతాపం (global warming) ఎందుకు కలుగుతుంది?

    • Answer : Plants need Carbon dioxide ($CO_2$) for photosynthesis. Fewer trees result in increased $CO_2$ levels in the atmosphere, which traps the heat rays reflected by the earth, leading to global warming.
    • సమాధానం : కిరణజన్య సంయోగక్రియ కోసం మొక్కలకు కార్బన్ డై ఆక్సైడ్ ($CO_2$) అవసరం. చెట్లు తగ్గడం వల్ల వాతావరణంలో $CO_2$ స్థాయి పెరుగుతుంది. ఇది భూమి నుండి పరావర్తనం చెందే ఉష్ణ కిరణాలను అడ్డుకోవడం వల్ల భూతాపం కలుగుతుంది.

 

Section C: Short Answer Questions (2 x 4 = 8 Marks)

18. What are endemic species? Give two examples from the Pachmarhi Biosphere Reserve.

ఎండమిక్ జాతులు అంటే ఏమిటి? పచ్మర్హి జీవావరణ రిజర్వ్ నుండి రెండు ఉదాహరణలు ఇవ్వండి.

    • Answer : Endemic species are those species of plants and animals found exclusively in a particular area and not naturally found anywhere else.
    • Flora example: Wild Mango.
    • Fauna example: Indian Giant Squirrel.
    • సమాధానం : ఒక నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే ప్రత్యేకంగా కనిపించే మొక్కలు లేదా జంతువుల జాతులను ఎండమిక్ జాతులు అంటారు. ఇవి సహజంగా మరెక్కడా కనిపించవు.
      • వృక్షజాలం ఉదాహరణ: అడవి మామిడి.
      • జంతుజాలం ఉదాహరణ: భారతదేశపు పెద్ద ఉడుత (ఇండియన్ జెయింట్ స్క్విర్రెల్).

19. Why should we save and recycle paper? Give two reasons.

మనం కాగితాన్ని ఎందుకు పొదుపు చేయాలి మరియు రీ సైకిల్ చేయాలి? రెండు కారణాలు తెలపండి.

    • Answer :
      1. To save trees, as it takes 17 full-grown trees to make one tonne of paper.
      2. To save energy and water needed for manufacturing, and to reduce the use of harmful chemicals.
    • సమాధానం :
      1. చెట్లను రక్షించడానికి; ఒక టన్ను కాగితం తయారు చేయడానికి 17 పూర్తిగా పెరిగిన వృక్షాలు అవసరం.
      2. కాగితం తయారీకి అవసరమయ్యే శక్తిని, నీటిని పొదుపు చేయడానికి మరియు హానికర రసాయనాల వినియోగాన్ని తగ్గించడానికి.

 

Section D: Long Answer Question (1 x 8 = 8 Marks)

20. A) Explain the consequences of deforestation on the environment and soil properties.

పర్యావరణం మరియు నేల లక్షణాలపై అటవీ నిర్మూలన వల్ల కలిగే పరిణామాలను వివరించండి.

    • Answer :
      • Environment: Increases temperature and pollution levels. It raises $CO_2$ levels leading to global warming. It disturbs the water cycle, reduces rainfall, and increases the risk of natural calamities like droughts and floods.
      • Soil Properties: Leads to soil erosion, exposing lower rocky layers. The soil loses humus and fertility, leading to desertification. It reduces the water-holding capacity and infiltration rate of the soil.
    • సమాధానం :
      • పర్యావరణం: భూమిపై ఉష్ణోగ్రతలు మరియు కాలుష్య స్థాయిలను పెంచుతుంది. $CO_2$ పెరగడం వల్ల భూతాపం కలుగుతుంది. ఇది జల చక్రానికి భంగం కలిగించి, వర్షపాతాన్ని తగ్గించి కరువులకు మరియు వరదలకు కారణమవుతుంది.
      • నేల లక్షణాలు: నేల క్రమక్షయం పెరిగి, పై పొర తొలగిపోవడంతో రాతి పొరలు బయటపడతాయి. నేల హ్యూమస్‌ను మరియు సారాన్ని కోల్పోయి ఎడారీకరణకు దారి తీస్తుంది. నేల నీటిని నిల్వ చేసే సామర్థ్యం మరియు నీరు ఇంకుదల రేటు తగ్గుతుంది.

(Or)

B) Compare and contrast a Wildlife Sanctuary, a National Park, and a Biosphere Reserve.

వన్యప్రాణుల అభయారణ్యం, జాతీయ ఉద్యానవనం మరియు జీవావరణ రిజర్వ్ ల మధ్య పోలికలు మరియు బేధాలను చర్చించండి.

Wildlife Sanctuary<br>వన్యప్రాణుల అభయారణ్యం

National Park<br>జాతీయ ఉద్యానవనం

Biosphere Reserve<br>జీవావరణ రిజర్వ్

Areas where animals are protected from any disturbance to them and their habitat.
జంతువులు, వాటి ఆవాసాలకు ఎలాంటి భంగం కలగకుండా రక్షించబడే ప్రాంతాలు.

Areas reserved for wildlife where they can freely use the habitats and natural resources.
వన్యప్రాణులు స్వేచ్ఛగా జీవిస్తూ ఆవాసాలు, సహజ వనరులను వినియోగించుకునే ప్రాంతాలు.

Large areas of protected land for conservation of wildlife, plant and animal resources and traditional life of tribals.
వన్యప్రాణులు, వృక్ష–జంతు వనరులు, గిరిజనుల సాంప్రదాయ జీవన సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన విశాల ప్రాంతం.

Comparatively smaller area.
తులనాత్మకంగా చిన్న ప్రాంతం.

Larger than wildlife sanctuary.
వన్యప్రాణుల అభయారణ్యం కంటే పెద్దది.

Very large area.
చాలా పెద్ద విస్తీర్ణం.

Protection of animals and their habitat.
జంతువులు మరియు వాటి ఆవాసాల రక్షణ.

Conservation of flora, fauna, landscape and natural resources.
వృక్షజాలం, జంతుజాలం, ప్రకృతి దృశ్యాల సంరక్షణ.

Conservation of biodiversity and culture.
జీవవైవిధ్యం మరియు సంస్కృతి పరిరక్షణ.

Some activities like grazing, collecting firewood and medicinal plants are allowed.
పశువులను మేపడం, కట్టెలు, ఔషధ మొక్కలు సేకరించడం అనుమతించబడుతుంది.

Grazing, hunting, poaching, collection of firewood and medicinal plants are not allowed.
మేపడం, వేటాడటం, హింసించడం, కట్టెలు మరియు ఔషధ మొక్కలు సేకరించడం నిషేధం.

Traditional life of tribals is protected.
గిరిజనుల సాంప్రదాయ జీవితం పరిరక్షించబడుతుంది.

Usually a single protected area.
సాధారణంగా ఒకే రక్షిత ప్రాంతం.

A single protected ecosystem.
ఒకే రక్షిత పర్యావరణ వ్యవస్థ.

May contain wildlife sanctuaries and national parks.
వన్యప్రాణుల అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలు ఉండవచ్చు.

Bharatpur Sanctuary, Bori Wildlife Sanctuary, Pachmarhi Wildlife Sanctuary
భరత్‌పూర్ అభయారణ్యం, బోరి, పచ్‌మర్హి

Kaziranga National Park, Satpura National Park
కాజీరంగా, సాత్పురా

Pachmarhi Biosphere Reserve, Great Nicobar Biosphere Reserve
పచ్‌మర్హి, గ్రేట్ నికోబార్

Protection and preservation of wild animals.
వన్య జంతువుల పరిరక్షణ మరియు సంరక్షణ.

Long-term conservation of ecosystems.
పర్యావరణ వ్యవస్థల దీర్ఘకాల సంరక్షణ.

Maintenance of biodiversity and national heritage.
జీవవైవిధ్యం మరియు జాతీయ వారసత్వ పరిరక్షణ.