9 class Biology - unit 1- The Fundamental Unit of Life - కణం-జీవుల మౌలిక ప్రమాణం Telugu Medum Notes - Click Here

 

9 జీవశాస్త్రం అధ్యాయం 1  కణం - జీవుల మౌలిక ప్రమాణం

పాఠం ముగింపు అభ్యాసాలు

 

1.        వృక్ష కణాలు, జంతు కణాల మధ్య పోలికలు, బేధాలు తెలుపండి.

 


మొక్క కణాలు (Plant Cells)

జంతు కణాలు (Animal Cells)

1. కణ కవచం (Cell Wall) మరియు కణ త్వచం ఉంటుంది

1. కణ కవచం ఉండదు. కణ త్వచం మాత్రమే ఉంటుంది

2. క్లోరోప్లాస్ట్‌లు ఉంటాయి (Photosynthesis)

2. క్లోరోప్లాస్ట్‌లు ఉండవు

3. పెద్ద రిక్తిక (Large Vacuole) ఉంటుంది

3. చిన్న రిక్తికలు ఉండవచ్చు లేదా అసలు వుండవు

4. పరిమాణంలో పెద్దగా ఉంటాయి

4. పరిమాణంలో చిన్నగా ఉంటాయి

 

2.       కేంద్రక పూర్వ కణం మరియు నిజ కేంద్రక కణం మధ్య తేడా ఏమిటి?

 

కేంద్రక పూర్వ కణం (Prokaryotic Cell)

నిజ కేంద్రక కణం (Eukaryotic Cell)

1.        పరిమాణం:

చిన్నది (1-10 μm)

1.        పరిమాణం:

పెద్దది (5-100 μm)

2. కేంద్రక త్వచం లేనందున, కేంద్రక ప్రాంతం స్పష్టంగా ఉండదు. దీనిని న్యూక్లియాయిడ్ అంటారు.

2. కేంద్రకం స్పష్టంగా ఉండి, కేంద్రక త్వచంతో ఆవరించబడి ఉంటుంది.

3. ఒకే ఒక్క క్రోమోసోమ్ ఉంటుంది.

3. ఒకటి కంటే ఎక్కువ క్రోమోసోములు ఉంటాయి.

4. త్వచంతో కప్పబడిన కణాంగాలు లేవు.

4. త్వచంతో కప్పబడిన కణాంగాలు ఉంటాయి.

3. ప్లాస్మాపొర పగిలితే లేదా విచ్ఛిన్నం చెందితే ఏమి జరుగుతుంది?

ప్లాస్మా పొర పగిలిపోతే, కొన్ని పదార్థాల అణువులు కణంలోకి లేదా బయటకు స్వేచ్ఛగా ప్రవహిస్తాయి. అది లేకుండా వ్యాపనం లేదా ద్రవాభిసరణం జరగదు. ప్లాస్మా పొర ఒక యాంత్రిక అడ్డంకిలా పనిచేస్తుంది, ప్లాస్మా పొర కణానికి ఆకారాన్ని మరియు సమగ్రతను అందిస్తుంది. అది విచ్ఛిన్నం అయితే, కణం తన ఆకారాన్ని కోల్పోయి, చివరకు నాశనం అవుతుంది.

 

4.        గాల్జీ సంక్లిష్టం లేకుంటే కణ జీవనానికి ఏమి జరుగుతుంది?

గాల్జీ యంత్రాంగం పదార్థాలను నిల్వ చేయడం, ప్యాకింగ్ చేయడం, మరియు పంపించడం వంటి పనులు చేస్తుంది. ఇది కణ నిర్మాణం మరియు లైసోజోమ్ల నిర్మాణంలో కూడా సహాయపడుతుంది. ఇది లేకపోతే, కణం ఉత్పత్తి చేసిన పదార్థాలను సరైన రీతిలో పంపలేదు. కాబట్టి కణ నిర్మాణం అసాధ్యమవుతుంది.

 

5. కణ శక్త్యాగారంగా కణాంగాన్ని పిలుస్తారు? ఎందుకు?

మైటోకాండ్రియాను కణ శక్త్యాగారం (Powerhouse of the cell) అంటారు. ఎందుకంటే ఇది జీవక్రియల కోసం అవసరమైన శక్తిని ATP (Adenosine Triphosphate) రూపంలో విడుదల చేస్తుంది. అందువల్ల ATPని "కణ శక్తి కరెన్సీ" (Energy currency) అని కూడా అంటారు.

 

6. కణ త్వచాన్ని నిర్మించే లిపిడ్లు మరియు ప్రోటీన్లు ఎక్కడ సంశ్లేషణ చేయబడతాయి?

లిపిడ్లు మరియు ప్రోటీన్లు అంతర్జీవ ద్రవ్యజాలం (Endoplasmic Reticulum - ER) లో తయారవుతాయి.

 

7. అమీబా తన ఆహారాన్ని ఎలా పొందుతుంది?

అమీబా, ఎండోసైటోసిస్ (Endocytosis) ప్రక్రియ ద్వారా ఆహారాన్ని గ్రహిస్తుంది. దీని కణ త్వచం సాగి మిధ్యపాదలుగా మారి ఆహార కణాలను చుట్టుముట్టి, ఆహార రిక్తిక (Food Vacuole) రూపంలో  చేస్తుంది. తరువాత అమీబా జీర్ణ ఎంజైములను విడుదల చేసి ఆహారాన్ని జీర్ణిస్తుంది.

 

8. ద్రవాభిసరణం అంటే ఏమిటి?


పరణాత్మక పారగమ్య త్వచం (Semipermeable membrane) గుండా నీటి అణువులు ఎక్కువ గాఢత ఉన్న ప్రాంతం నుండి తక్కువ గాఢత ఉన్న ప్రాంతానికి కదిలే ప్రక్రియను ద్రవాభిసరణం (Osmosis) అంటారు.

 

9. ద్రవాభిసరణం ప్రయోగాన్ని నిర్వహించండి:

ప్రయోగ వివరణ (Osmosis Potato Cup Experiment): బంగాళాదుంప కప్పులను తయారు చేయడానికి నాలుగు ఒలిచిన బంగాళాదుంప భాగాలను తీసుకోండి బంగాళదుంప కప్పులలో ఒకదానిని ఉడికించిన బంగాళాదుంప నుండి తయారుచేసినదై ఉండాలి. ప్రతి బంగాళాదుంప కప్పును నీటితో కూడిన తొట్టిలో ఉంచండి.

() కప్పు A ను ఖాళీగా ఉంచండి

(బి) కప్పు B లో ఒక టీస్పూన్ చక్కెర వేయండి

(సి) కప్పు C లో ఒక టీస్పూన్ ఉప్పు వేయండి

(డి) ఉడకబెట్టిన బంగాళాదుంప ఉన్న కప్పు D లో ఒక టీస్పూన్ పంచదార వేయండి.

వీటిని రెండు గంటలపాటు ఉంచండి. తరువాత నాలుగు బంగాళాదుంప కప్పులను గమనించి క్రింది వాటికి సమాధానం ఇవ్వండి:

(i) B మరియు C యొక్క బోలుగా ఉన్న భాగంలో నీరు ఎందుకు చేరుతుందో వివరించండి.

 B మరియు C కప్పుల్లో చక్కెర, ఉప్పు ఉండటం వలన అక్కడ గాఢత ఎక్కువగా ఉంటుంది. కణం వరణాత్మక పారగమ్య త్వచంలా పనిచేసి, బయట నీరు లోపలికి వస్తుంది. దీనిని ఎండోస్మోసిస్ (Endosmosis) అంటారు. అందువల్ల లోపల నీరు చేరుతుంది.

(ii) ప్రయోగానికి బంగాళదుంప A ఎందుకు అవసరం?

కప్ A‌ను ఉపయోగించడం ద్వారా ఇతర కప్పుల (B, C, D) ప్రభావాలను పోల్చే అవకాశముంటుంది. ఇది నియంత్రిత పరిస్థితిని సూచిస్తుంది. కప్ A లో ద్రవాభిసరణం జరగదని మనం గమనించగలము.

(iii) A మరియు D యొక్క బోలుగా ఉన్న భాగాలలో నీరు ఎందుకు చేరదు వివరించండి.

 A కప్‌లో లోపల మరియు వెలుపల నీటి గాఢత తేడా లేకపోవడం వలన ద్రవాభిసరణం జరగదు.  D కప్ ఉడికిన ఆలుగడ్డతో తయారుచేయబడింది. అందులో కణాలు చనిపోయినవిగా ఉండటంతో పరణాత్మక పారగమ్య త్వచం పనిచేయదు. కాబట్టి ద్రవాభిసరణం జరగదు.

 

10. శరీరం యొక్క పెరుగుదల, మరమ్మత్తు కోసం రకమైన కణ విభజన అవసరం మరియు బీజకణాలు ఏర్పడడంలో ఏరకమైన కణ విభజన అవసరం?

సమవిభజన  (Mitosis): శరీరంలో పెరుగుదల మరియు కణాల మరమ్మతు కోసం అవసరమైన కణ విభజన. ఇందులో తల్లి కణం, రెండు సమానమైన పిల్ల కణాలుగా విభజించబడుతుంది.

క్షయకరణ విభజన  (Meiosis): సంయోగ బీజాలు (శుక్ర మరియు అండ కణాలు ) తయారయ్యే ప్రక్రియ. ఇందులో క్రోమోసోమ్ల సంఖ్య సగం  గా మారుతుంది.

Exercise 5.1

1. కణాలను ఎవరు, ఎలా కనుగొన్నారు?

సంవత్సరం 1665లో, రాబర్ట్ హుక్ తన స్వయంగా రూపొందించిన సూక్ష్మదర్శినితో ఒక పలుచని బెండు ముక్కను పరిశీలిస్తూ ఉండగా, తేనెపట్టు నిర్మాణంలా అనేక చిన్న గదులుగా ఉన్నట్లు గమనించాడు. గదులను "కణాలు" (Cells) అని పిలిచాడు. ఇది జీవశాస్త్ర చరిత్రలో మొదటి కణాల అన్వేషణ.

2. కణాన్ని జీవి యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం అని ఎందుకు అంటారు?

కణం శ్వాసక్రియ (Respiration), జీర్ణక్రియ (Digestion), విసర్జన (Excretion) లాంటి అన్ని ప్రాథమిక జీవ ప్రక్రియలను స్వతంత్రంగా నిర్వహించగలదు. ఏకకణ జీవులలో మరియు బహుకణ జీవులు అన్నీ కణాలతో తయారయ్యాయి . కాబట్టి, కణాన్ని జీవి యొక్క నిర్మాణ మరియు క్రియాత్మక ప్రమాణం అని అంటారు.

Exercise 5.2.1

3. CO₂ మరియు నీటి వంటి పదార్థాలు కణంలోకి, బయటకు ఎలా కదులుతాయి?

CO₂ వంటి వాయువులు "వ్యాపనం" (Diffusion) ద్వారా కణం లోపల నుండి తక్కువ సాంద్రత గల బాహ్య వాతావరణానికి కదులుతాయి. ఇది గాఢత వ్యత్యాసం ఆధారంగా జరుగుతుంది. నీరు "ద్రవాభిసరణం" (Osmosis) ద్వారా పారగమ్య త్వచం గుండా అధిక జలసాంద్రత గల ప్రాంతం నుండి తక్కువ జలసాంద్రత గల ప్రాంతానికి కదులుతుంది.

4. ప్లాస్మా పొరను వరణాత్మక పారగమ్య త్వచం (selectively permeable membrane) అని ఎందుకు అంటారు?

ప్లాస్మా పొర (Plasma Membrane) కొన్ని నిర్దిష్ట అణువులను మాత్రమే లోపలికి లేదా వెలుపలికి వెళ్లేందుకు అనుమతిస్తుంది. అన్ని పదార్థాలు త్వచం గుండా సులభంగా ప్రసరించలేవు. అందుకే దీనిని వరణాత్మక పారగమ్య త్వచం అంటారు.

Exercise 5.2.2 to 5.2.4

5. క్రింది పట్టికలోని ఖాళీలను నింపండి కేంద్రక పూర్వ కణాలు మరియు నిజ కేంద్రక కణాల మధ్య తేడాలను చూపించండి.

కేంద్రక పూర్వ కణం (Prokaryotic Cell)

నిజ కేంద్రక కణం (Eukaryotic Cell)

1. పరిమాణం: సాధారణంగా చిన్నది (1-10 μm)

1. పరిమాణం: సాధారణంగా పెద్దది (5-100 μm)

2. కేంద్రక త్వచం ఉండదు.  అనిశ్చితమైన కేంద్రకం (న్యూక్లియాయిడ్)

2. కేంద్రక త్వచంతో స్పష్టంగా వేరుచేయబడిన కేంద్రకం వుంటుంది

3. ఒకే ఒక్కటి క్రమోసోమ్‌ వుంటుంది

3. క్రమోసోమ్‌లు ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి

4. త్వచంతో కప్పబడిన కణాంగాలు వుండవు

4. త్వచంతో కప్పబడిన కణాంగాలు ఉంటాయి

 

Exercise – 5.2.5

6. మేము చదివిన రెండు స్వంత జన్యు పదార్థాన్ని కలిగిన కణాంగాల పేర్లను చెప్పగలరా?

జన్యు పదార్థం (Genetic Material) స్వంతంగా కలిగిన రెండు కణాంగాలు:

1.        మైటోకాండ్రియా (Mitochondria)

2.        ప్లాస్టిడ్లు (Plastids)

7. భౌతిక లేదా రసాయన ప్రభావం వల్ల కణ నిర్మాణం నాశనం అయితే ఏమి జరుగుతుంది?

కణం దెబ్బతిన్నపుడు మరియు అది తిరిగి పునరుద్ధరించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, లైసోజోమ్లు పేలి, వాటి లోని ఎంజైములు కణాన్ని జీర్ణం చేస్తాయి. అందుకే లైసోజోమ్లను ఆత్మహత్య సంచులు (Suicide Bags) అని అంటారు.

8. లైసోజోమ్లను ఆత్మహత్య సంచులు (Suicide Bags) అని ఎందుకు అంటారు?

కణం ప్రమాదకర పరిస్థితుల్లో ఆ కణంలోని  లైసోజోమ్లు  పేలి, దాని ఎంజైములు ఆ కణాన్ని  విచ్చిన్నం చేస్తుంది . అందువల్ల వాటిని "ఆత్మహత్య సంచులు" అని పిలుస్తారు.

9. కణం లోపల ప్రోటీన్లు ఎక్కడ తయారవుతాయి?

కణాల్లో ప్రోటీన్లు రైబోజోమ్లలో (Ribosomes) తయారవుతాయి. అందువల్ల, వాటిని ప్రోటీన్ ఫ్యాక్టరీలు (Protein Factories) అని కూడా అంటారు. రైబోజోమ్లు గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం (Rough Endoplasmic Reticulum – RER) పై అతుక్కొని ఉంటాయి.