SSC పబ్లిక్ పరీక్ష
(2025-26) మోడల్ పేపర్-1
జనరల్ సైన్స్ పేపర్ - II
జీవశాస్త్రం
సమయం: 2 గంటలు గరిష్ట మార్కులు : 50
విభాగము – 1 6
x 1 = 6M
1. రాము రవి యొక్క రక్తపీడనమును కొలవాలని
అనుకున్నాడు. రాము ఉపయోగించిన పరికరం పేరు వ్రాయండి.
• స్ఫిగ్మోమానోమీటర్
2. ఏక సంకర సంకరీకరణంలో దృశ్యరూప
నిష్పత్తి ఎంత ?
• 3 : 1
3. అండకోశములోని ఏ భాగం కాయగా మారుతుందో
దాని పేరు రాయండి ?
• అండాశయం (Ovary)
4. అవయవదానంపై నినాదం వ్రాయండి ?
• అవయవాలు దానం చేయండి – జీవితాలను కాపాడండి.
5. HIV ని విశదీకరించండి ?
• హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్
6. లింగనిర్ధారణ కోసం క్రోమోసోమ్లపై
ఆధారపడని జంతువులకు రెండు ఉదాహరణలు ఇవ్వండి ?
• మొసలి
• తాబేలు
విభాగము – II 4 x 2 = 8M
7. పోషణ విధానం – ఉదాహరణలు
|
పోషణ విధానం |
ఉదాహరణలు |
|
స్వయం పోషణ |
మొక్కలు, శైవలాలు |
|
పరావు పోషణ |
కస్కుట, పేను, జలగ |
క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానములు
వ్రాయండి.
1. కిరణజన్య సంయోగక్రియ ఏ పోషణ విధానంలో
కనిపిస్తుంది ?
• స్వయం పోషణ
2. పరాన్నపోషణ విధానం ఏ మొక్కలో చూస్తాము ?
• కస్కుట
8. రక్తంలో థైరాక్సిన్ స్థాయిని తగు
స్థాయిలో ఉంచుటకు నీవు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటావు ?
• ఆహారంలో అయోడిన్ కలిగిన ఉప్పు ఉపయోగిస్తాను.
• సమతుల ఆహారం తీసుకొని, అవసరమైతే వైద్యుడిని సంప్రదిస్తాను.
9. జైవికవృద్ధీకరణను నియంత్రించుటకు రెండు
సలహాలను ఇవ్వండి ?
• రసాయన కీటకనాశకాలు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలి.
• పర్యావరణ హితమైన, జీవ విచ్ఛిన్న పదార్థాలను ప్రోత్సహించాలి.
10. సినాప్స్ అనగానేమి ? సినాప్స్ వద్ద ఏమి జరుగుతుంది ?
• రెండు నాడీకణాల మధ్య ఉన్న సంధిని సినాప్స్
అంటారు.
• సినాప్స్ వద్ద రసాయనాల ద్వారా నాడీ ప్రచోదనం ఒక నాడీకణం నుండి మరొకదానికి ప్రసారం అవుతుంది.
విభాగము - III
11. మధుమేహం వ్యాధికి సంబంధించిన
వైద్యుడిని నీవు ఎటువంటి ప్రశ్నలు అడుగుతావు.
• మధుమేహం అంటే ఏమిటి? ఇది ఎందుకు వస్తుంది?
• రక్తంలో చక్కెర స్థాయిని ఎలా నియంత్రించుకోవాలి?
• ఏ ఆహార పదార్థాలు తినాలి? ఏ ఆహార పదార్థాలు తినకూడదు ?
• మధుమేహం నియంత్రించకపోతే ఏమి జరుగుతుంది?
12. ఎ) విసర్జన వ్యవస్థ లోని నిర్మాణాత్మక
క్రియాత్మక ప్రమాణం యొక్క పటమును గీచి, భాగాలను గుర్తించండి ?
• నెఫ్రాన్ విసర్జన వ్యవస్థ యొక్క
నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం.
(లేదా)
12. బి) పుష్పము యొక్క నిలుపుకోత పటమును
గీచి, భాగాలను గుర్తించండి ?
13. వ్యర్థాల తొలగింపులో ఉత్పన్నమగు
సమస్యలను తగ్గించుటకు నీవు ఏ విధంగా సహాయపడతాయి.
• తగ్గించు, మళ్లీ ఉపయోగించు, పునర్వినియోగం చేయు విధానాన్ని
పాటిస్తాను.
• జీవవిలీన వ్యర్థాలు, అజీవవిలీన వ్యర్థాలను వేరు చేస్తాను.
• ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తాను.
• వంటింటి వ్యర్థాలతో కంపోస్ట్ తయారు చేస్తాను.
14. సమర్థవంతమైన వాయు వినిమయానికి
ఊపిరితిత్తులలోని వాయుగోణుల నిర్మాణం సహకరిస్తుంది. దీనిని నీవు ఎలా సమర్థిస్తావు ?
• వాయుగోణులకు విశాల ఉపరితల వైశాల్యం
ఉంటుంది.
• వాయుగోణుల గోడలు చాలా పలుచగా ఉంటాయి.
• వాయుగోణులు రక్త కేశనాళికలతో చుట్టుముట్టబడి
ఉంటాయి.
• వాయువుల వ్యాపనం సులభంగా జరుగుతుంది.
15. ఓజోన్ పొర తగ్గుదల ఎందువలన మనం
పరిష్కరించుకోవలసిన సమస్య ? ఈ సమస్యను తగ్గించటానికి ఎటువంటి
మార్గాలను అవలంభించవలసి ఉంటుంది ?
• ఓజోన్ పొర హానికర అల్ట్రా వైలెట్
కిరణాల నుండి రక్షిస్తుంది.
• ఓజోన్ పొర తగ్గుదల వల్ల చర్మ క్యాన్సర్,
కంటి సమస్యలు కలుగుతాయి.
• CFCలు మరియు హానికర రసాయనాల వినియోగాన్ని
నివారించాలి.
• పర్యావరణ హితమైన ఉత్పత్తులను ఉపయోగించాలి.
• అవగాహన కల్పించి వృక్షారోపణ చేయాలి.
విభాగము - IV
16. ఎ) కిరణజన్య సంయోగక్రియకు పత్రహరితం
అవసరమని నిరూపించే ప్రయోగాన్ని వ్రాయండి.
ఉద్దేశ్యం :
కిరణజన్య సంయోగక్రియకు పత్రహరితం అవసరమని
నిరూపించుట.
పరికరాలు :
రంగురంగుల ఆకులు గల మొక్క, నీరు, ఆల్కహాల్, బీకర్, వాటర్ బాత్, అయోడిన్ ద్రావణం.
ప్రయోగ విధానం :
• మొక్కను మూడు రోజులపాటు చీకటి గదిలో ఉంచాలి.
• ఆ తరువాత నాలుగు గంటలపాటు సూర్యరశ్మిలో ఉంచాలి.
• మొక్క నుండి ఒక రంగురంగుల ఆకును తీసుకొని
ఆకుపచ్చ భాగాలను గుర్తించాలి.
• ఆకును మరుగుతున్న నీటిలో కొద్ది నిమిషాలు
ఉంచాలి.
• తరువాత ఆల్కహాల్‌లో వాటర్ బాత్ సహాయంతో వేడి
చేయాలి.
• ఆకును బయటకు తీసి అయోడిన్ ద్రావణం వేసి
పరిశీలించాలి.
పరిశీలన :
• ఆకుపచ్చ భాగాలు నీలం–నలుపు రంగులోకి మారుతాయి.
• పసుపు రంగు భాగాలు రంగు మార్పు చూపవు.
నిర్ధారణ :
పిండి పదార్థం ఆకుపచ్చ భాగాలలో మాత్రమే
ఏర్పడింది.
అందువల్ల కిరణజన్య సంయోగక్రియకు పత్రహరితం
అవసరం.
(లేదా)
16. బి) ఈస్ట్ నందు మొగ్గ తొడగడాన్ని
పరిశీలించుటకు నీవు ప్రయోగశాలలో అనుసరించిన విధానమును వ్రాయండి.
ఉద్దేశ్యం :
ఈస్ట్‌లో మొగ్గ తొడగడం ద్వారా అలైంగిక
ప్రత్యుత్పత్తిని పరిశీలించుట.
పరికరాలు :
చక్కెర, నీరు, ఈస్ట్, పరీక్షనాళిక, గాజు స్లైడ్, కవర్ స్లిప్, సూక్ష్మదర్శిని.
ప్రయోగ విధానం :
• నీటిలో కొంత చక్కెర కలిపి ద్రావణం తయారు
చేయాలి.
• ద్రావణాన్ని పరీక్షనాళికలో పోయాలి.
• కొద్దిపాటి ఈస్ట్‌ను జోడించాలి.
• పరీక్షనాళికను గోరువెచ్చని ప్రదేశంలో కొంతసేపు
ఉంచాలి.
• గాజు స్లైడ్‌పై ద్రావణం వేసి సూక్ష్మదర్శినిలో
పరిశీలించాలి.
పరిశీలన :
• అండాకార ఈస్ట్ కణాలు కనిపిస్తాయి.
• కొన్ని కణాలపై చిన్న మొగ్గలు కనిపిస్తాయి.
నిర్ధారణ :
ఈస్ట్ మొగ్గ తొడగడం ద్వారా అలైంగిక
ప్రత్యుత్పత్తి జరుపుతుంది.
17. ఎ) ప్రతీకార చర్యల యాంత్రీకతను
విశ్లేషించండి.
• ప్రతీకార చర్య వేగవంతమైన, ఆలోచన లేని ప్రతిస్పందన.
• ఉద్దీపనను గ్రాహకాలు గుర్తిస్తాయి.
• సంకేతం జ్ఞాన నాడుల ద్వారా వెన్నుపాము కు
చేరుతుంది.
• వెన్నుపాము లో ప్రతీకార వలయం ఏర్పడుతుంది.
• చాలక నాడుల ద్వారా ప్రభావకానికి సంకేతం పంపబడుతుంది.
• కండరాలు వెంటనే సంకోచించి చర్య జరుగుతుంది.
• ఉదాహరణ: వేడి వస్తువును తాకిన వెంటనే చేతిని
వెనక్కి తీసుకోవడం.
• ఇవి శరీరాన్ని ప్రమాదాల నుండి రక్షిస్తాయి.
(లేదా)
17. బి) లింగనిర్ధారణకు మగవారే కారణము. ఈ
వాక్యమును సమర్థిస్తూ ఫ్లో చార్ట్ సహాయంతో వివరించండి.
అవును, లింగనిర్ధారణకు మగవారే కారణము.
• స్త్రీలలో XX క్రోమోసోములు ఉంటాయి.
• పురుషులలో XY క్రోమోసోములు ఉంటాయి.
• అండకణం X క్రోమోసోమ్‌ను మాత్రమే కలిగి ఉంటుంది.
• శుక్రకణం X లేదా Y క్రోమోసోమ్‌ను కలిగి ఉంటుంది.
ఫ్లో చార్ట్ :
అండకణం (X) + శుక్రకణం (X) → XX → బాలిక
అండకణం (X) + శుక్రకణం (Y) → XY → బాలుడు
నిర్ధారణ :
శిశువు లింగం తండ్రి నుండి వచ్చే శుక్రకణంపై
ఆధారపడి ఉంటుంది.