10 BS FA 2 TM KEY 2026

 

10 Class  BIOLOGY - FA 2 (OCT 2025) KEY

SECTION I    (5 x 1 = 5)

1.       శరీర భంగిమ మరియు సమతాస్థితిని నియంత్రించే మెదడు భాగం ఏది?

ANS: అనుమస్తిష్కము

2.. DNA విస్తరించండి.

డీఆక్సీరైబోన్యూక్లిక్ ఆమ్లం (Deoxyribonucleic Acid)

3.     పటంలో చూపించబడ్డ అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం పేరు ఏమిటి?

            


 

ANS: ద్విదావిచ్చిత్తి (Binary Fission)

4. రెండు నాడీ కణాల మధ్యనున్న ఖాళీని ఏమంటారు?

ANS: C) synapse సినాప్స్

5. బాలిక బ్రూణ హత్యలు నిరోధించేలా ప్రజలకు అవగాహన కల్పించటానికి ఒక నినాదాన్ని రాయండి.

ANS:       "కూతురు ఒక వరం, భారం కాదు - ఆమెను బ్రతకనివ్వండి!"

"ఆడపిల్లను కాపాడండి, భవిష్యత్తును కాపాడండి!"

 

SECTION - II (3 X 2 = 6)

 

6. ముష్కాల విధులు ఏమిటి ?

    1. ముష్కాలు  శుక్రకణాలను  ఉత్పత్తి చేస్తాయి.
    2. ముష్కాలు టెస్టోస్టెరోన్  అనే పురుష హార్మోన్‌ను స్రవిస్తాయి. ఇది పురుష ప్రత్యుత్పత్తి  అవయవాల అభివృద్ధి మరియు ద్వితీయ లైంగిక లక్షణాలను నియంత్రిస్తుంది.

 

7. క్రింద ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించి సమాధానం ఇవ్వండి.

మొక్కల హార్మోన్

పని

ఆక్సిన్

కణాల పొడవును పెంచుతుంది, కాంతికి అనువర్తనం

జిబ్బరిల్లిన్

కాండం ఎదుగుదల

సైటోకైనిన్స్

కణ విభజన

అబ్సిసిక్ ఆమ్లం

ఎదుగుదలను అడ్డుకోవడం, ఆకులు వాడిపోవడం

 

i) పొడవైన మొక్కలను పొందడానికి సహాయపడే హార్మోన్ ఏది ?

ANS: జిబ్బరెల్లిన్

ii) ఆకులు రాలిపోవడానికి కారణమయ్యే హార్మోన్ ఏది ?

ANS: అబ్సిసిక్ ఆమ్లం

 

8.  రక్తంలో సరైన స్థాయిలో థైరాక్సిన్ హార్మోన్ ఉండేందుకు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?

    1. ఆహారంలో అయోడిన్ కలిగిన ఉప్పు ఉపయోగించాలి, ఎందుకంటే థైరాయిడ్ గ్రంథి (thyroid gland) థైరాక్సిన్ (thyroxine) తయారు చేయడానికి అయోడిన్ అవసరం.
    2. సమతుల ఆహారం తీసుకోవాలి మరియు తరచూ  వైద్య పరీక్షలు చేయించుకోవాలి, తద్వారా థైరాయిడ్ సంబంధిత సమస్యలను తొందరగా గుర్తించి నియంత్రించవచ్చు.

 

SECTION - III (4 X 4 = 16)

9. ప్రత్యుత్పత్తిలో DNA నకలు తయారీ ప్రక్రియ యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

         I.            DNA కాపీ చేయడం ద్వారా తల్లిదండ్రుల నుండి సంతతికి జన్యు సమాచారం (genetic information) సంక్రమిస్తుంది.  ఇది సంతానం తల్లిదండ్రులతో పోలి ఉండేలా చేస్తుంది.

       II.            DNA నకలు తయారీ ప్రక్రియ చేసే సమయంలో జరిగే చిన్న మార్పులు  జీవులు పర్యావరణానికి అనుకూలంగా మారి పరిణామం (evolution) చెందడానికి సహాయపడతాయి.

      III.            ఇది కొత్త కణాల తయారి, పెరుగుదల మరియు మరమ్మతు కోసం అవసరం

     IV.            ఇది శరీరంలోని అన్ని కణాల సక్రమ పనితీరు మరియు అభివృద్ధిని  నిర్ధారిస్తుంది.

 

10. మొక్కలు ఉద్దీపనలకు స్పందిస్తాయా? సరైన ఉదాహరణలతో మీ సమాధానాన్ని సమర్థించుకోండి.

అవును, మొక్కలు ఉద్దీపనలకు స్పందిస్తాయి.మొక్కలు జంతువులలాగా కదలలేకపోయినా, అవి పర్యావరణంలోని ఉద్దీపనలకు (stimuli) వివిధ రకాలుగా స్పందిస్తాయి.

ఉదాహరణలు (Examples):

    1. కాంతి అనువర్తనం
      మొక్కల కాండం కాంతి  వైపు వంగుతుంది.
      ఉదా: సూర్యకాంతి వైపు పెరిగే మొక్కలు.
    2. గురుత్వానువర్తనం
      వేర్లు (roots) భూమి గురుత్వాకర్షణ వైపు పెరుగుతాయి.
      ఉదా: వేర్లు నేలలోకి దిగడం.
    3. స్పర్శనువర్తనం (Thigmotropism):
      కొంతమంది ఎక్కే మొక్కల నులితీగలు  తాకిన వస్తువులను చుట్టుకుంటాయి.
      ఉదా: చిక్కుడు జాతి మరియు బటాని మొక్కల నులితీగలు  కర్ర (ఆధారం) చుట్టూ తిరగడం.

మొక్కలు వివిధ రకాల ఉద్దీపనలకు కాంతి, స్పర్శ, గురుత్వాకర్షణ, నీరు మొదలైన వాటికి స్పందిస్తాయి. అందువల్ల మొక్కలు కూడా జీవులలాగే ఉద్దీపనలకు ప్రతిస్పందించే జీవులు.

 

11. గ్రాహకాలు సరిగ్గా పనిచేయకపోతే సమస్యలు తలెత్తవచ్చు? Top of Form

గ్రాహకాలు  అనేవి ఉద్దీపనలను గుర్తించి నాడీ వ్యవస్థకు సంకేతాలను పంపే భాగాలు. ఇవి సరిగా పనిచేయకపోతే శరీరానికి పలు సమస్యలు తలెత్తుతాయి.

సమస్యలు:

    1. వెలుగు, శబ్దం, ఉష్ణం లేదా నొప్పి వంటి ఉద్దీపనలను గుర్తించలేము.
    2. శరీరం ఉద్దీపనకు సరైన ప్రతిస్పందన ఇవ్వకపోవచ్చు ఉదా: వేడిని తాకినా చేతిని వెంటనే వెనక్కి తీయకపోవడం.
    3. మెదడు మరియు అవయవాల మధ్య సంబంధం సరిగ్గా ఉండదు.
    4. నొప్పి లేదా ప్రమాద సూచనలను గుర్తించకపోవడం వల్ల గాయాలు తీవ్రం కావచ్చు.
    5. కంటి, చెవి, చర్మం వంటి ఇంద్రియ అవయవాలు సరిగా పనిచేయవు ఉదా: చూపు తగ్గడం, వినికిడి లోపం మొదలైనవి.

గ్రాహకాలు సరిగా పనిచేయకపోతే శరీరం ఉద్దీపనలకు సరైన ప్రతిస్పందన ఇవ్వలేకపోతుంది, దాంతో శరీర సమన్వయం మరియు రక్షణ వ్యవస్థ దెబ్బతింటాయి.

 

12. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క చక్కని పటాన్ని గీచి భాగాలు గుర్తించండి.

                


 

SECTION - IV (1 X 8 = 8)

 

13. మొక్కలలో కాంతి అనువర్తనాన్ని ఎలా నిరూపిస్తారు?

 

ఉద్దేశ్యం :

మొక్కలు కాంతి వైపు వంగి పెరుగుతాయనే కాంతి అనువర్తనాన్ని నిరూపించడం.

పరికరాలు :

కొనికల్ ఫ్లాస్క్, వైర్ మెష్ (Wired mesh), కార్డ్‌బోర్డ్ పెట్టె , మొలకెత్తిన చిక్కుడు గింజలు, నీరు.

పరికరాల అమరిక (Diagram showing setup):

            


 

విధానం (Procedure):

 

    1. ఒక కొనికల్ ఫ్లాస్క్‌లో నీరు నింపి, దాని మెడపై వైర్ మెష్‌తో కప్పండి.
    2. మెష్‌పై 2–3 తాజా మొలకెత్తిన బీన్ గింజలను ఉంచండి.
    3. ఫ్లాస్క్‌ను ఒక కార్డ్‌బోర్డ్ పెట్టెలో ఉంచి, దానిలో కేవలం ఒక వైపు మాత్రమే కాంతి వచ్చేలా వదిలేయండి (కిటికీ వైపు).
    4. 2–3 రోజుల పాటు అలాగే ఉంచి గమనించండి మొలకలు కాండాలు కాంతి వైపు వంగుతాయి, వేర్లు (roots) కాంతి నుండి దూరంగా పెరుగుతాయి.
    5. తరువాత ఫ్లాస్క్‌ను తిప్పి మొలకలు కాంతికి విరుద్ధంగా ఉంచండి; మరికొన్ని రోజులు గమనిస్తే అవి మళ్లీ కాంతి వైపు వంగుతాయి.

పరిశీలన :

మొక్కల కాండం  కాంతి వైపు వంగి పెరుగుతాయి, వేర్లు (roots) కాంతి నుండి దూరంగా, కిందకు పెరుగుతాయి.

నిరూపణ : కాండం  సానుకూల కాంతి అనువర్తనాన్ని  చూపుతాయి అంటే కాంతి వైపు పెరుగుతాయి.

 

 

B) పరాగసంపర్కం మరియు ఫలదీకరణం మధ్య భేదాలను వ్రాయండి.

 

పరాగసంపర్కం

ఫలదీకరణం

1

ఫలదీకరణకు ముందే జరుగుతుంది

పరాగసంపర్కం తర్వాత జరుగుతుంది

2

పరాగరేణువు కీలాగ్రం వరకు చేరడం

పురుష మరియు ఆడ కణాలు కలిసిపోవడం

3

అండాశయం వెలుపల జరుగుతుంది

అండాశయం లోపల జరుగుతుంది

4

పరాగరేణువులు పాల్గొంటాయి

పురుష మరియు ఆడ కణాలు పాల్గొంటాయి

5

పరాగరేణువు కీలాగ్రం  చేరడానికి సహాయపడు ప్రక్రియ

సమ్యుక్తబీజం (Zygote) ఏర్పడటానికి సహాయపడుతుంది

6

గాలి, పువ్వుల కీటకాలు, నీరు లేదా జంతువుల ద్వారా జరుగుతుంది

పువ్వుల లోపల సహజంగానే జరుగుతుంది

7

విత్తనం లేదా పండు ఏర్పడదు

ఫలదీకరణ తర్వాత విత్తనాలు మరియు పండ్లు ఏర్పడతాయి

8

మొక్కల ప్రత్యుత్పత్తి  మొదటి దశ

మొక్కల ప్రత్యుత్పత్తి  చివరి దశ

 

 

Bottom of Form