10 BS TM SA 1 KEY 2026

 

స్వీయ మూల్యాంకన 1 మోడల్ పేపర్-2025-2026

జనరల్ సైన్స్ - పేపర్ II   జీవ శాస్త్రం తరగతి: X

(గరిష్ట మార్కులు: 50) [సమయం: 2.00 గంటలు.

విభాగం-I   6x1=6

 

1. కిరణజన్య సంయోగక్రియకు సంబంధించిన సంతులిత రసాయనిక సమీకరణం వ్రాయండి.



 

2. క్రింది నమూనా పటం దేనికి సూచిస్తుంది?

ద్వివలయ రక్త ప్రసరణ ను సూచిస్తుంది

 

3. ADP ని విస్తరించండి.

ADP – అడెనోసిన్ డై ఫాస్ఫేట్

 

4. పాత దారు కణములలో మొక్కలు నిల్వచేసుకునే వ్యర్థ పదార్థాలేవి?

రెసిన్లు, టానిన్లు, ఆయిల్స్ మరియు గమ్ లు వంటి వ్యర్థ పదార్థాలు నిల్వ చేయబడుతాయి.

 

5. మనము అయోడిన్ కలిగిన ఉప్పు పాకెట్లు కొంటాము. ఇది సరైనదేనా? మన ఆహారంలో అయోడిన్ ను ఎందుకు చేర్చాలి?

అవును, అయోడిన్ కలిగిన ఉప్పు కొనడం సరైన నిర్ణయం.
అయోడిన్ థైరాయిడ్ హార్మోన్ తయారీలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

అయోడిన్ లోపం గొయిటర్ వంటి వ్యాధులకు కారణం అవుతుంది.

శరీరంలోని అభివృద్ధి, జీవ క్రియలు (metabolic activities) సక్రమంగా జరిగేందుకు అయోడిన్ అవసరం.

 

6. "పొగాకు వాడకం వద్దు" అనే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించటానికి ఒక నినాదం రాయండి.

"పొగాకు నివారణ ఆరోగ్య రక్షణ!"

 

విభాగం-II     4x2=8

 

7. కిణ్వనము అనగా నేమి ? మనం దీనిని ఎక్కడ వాడతాము?

కిణ్వనం (Fermentation) అనేది ఈస్టు వంటి సూక్ష్మజీవులు ఆక్సిజన్ లేని పరిస్థితిలో చెక్కరలను ఆల్కహాల్ మరియు కార్బన్ డై ఆక్సైడ్‌గా మార్చే ప్రక్రియ.
ప్రక్రియను బ్రెడ్, ఇడ్లీ మిశ్రమం, పెరుగు, వైన్, ఆల్కహాల్ తయారీలో ఉపయోగిస్తారు.

 

8.

అనువర్తన చలనాలు

ఉద్దీపన

కాంతి అనువర్తనం

కాంతి

స్పర్శ అనువర్తనం

స్పర్శ

రసాయన అనువర్తనం

రసాయనాలు

నీటి అనువర్తనం

నీరు

గురుత్వ అనువర్తనం

గురుత్వాకర్షణ

 

a) రసాయనాల వలన కలిగే ప్రతిస్పందనను ఏమంటారు?

రసాయన అనువర్తనం

b) రకమైన అనువర్తనాలు నులితీగలు ఆధారంవైపు పెరుగుటకు కారణం అవుతాయి?

స్పర్శ అనువర్తనం

 

9. ఏకలింగ పుష్పాలు, ద్విలింగపుష్పాలు అంటే ఏమిటి ? ఉదాహరణలతో వివరించండి.

ఏక లింగ పుష్పాలు: ఒకే పుష్పంలో కేసరాలు (stamens) లేదా అండకోశం (pistil) ఏదో ఒకటి మాత్రమే ఉండే పుష్పాలు.
ఉదాహరణలు: పపాయ, పుచ్చకాయ, మొక్కజొన్న.

ద్విలింగపుష్పాలు (ఉభయ లింగ పుష్పాలు):

ఒకే పుష్పంలో కేసరాలు మరియు అండకోశం రెండూ ఉండే పుష్పాలు.
ఉదాహరణలు: మందార, ఆవాలు, గులాబీ  .

 

10. మధుమేహం ఒక దీర్ఘకాలిక వ్యాధి మీ తాతగారికి గల మధుమేహం నియంత్రణకు నీవు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటావు..

తక్కువ పంచదార, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న సమతుల ఆహారం ఇవ్వాలి.
ప్రతిరోజూ నడక / సాధారణ వ్యాయామం ప్రోత్సహించాలి.
మందులు లేదా ఇన్సులిన్ సమయానికి తీసుకునేలా చూడాలి.
రక్తంలో చక్కెర స్థాయిలను నియమితంగా పరిశీలించాలి.

 

విభాగం-III         5 x 4 = 20

 

11. మానవులలోని వివిధ రక్తనాళాలేమిటి ? వాటి విధులు వ్రాయుము.

మానవ శరీరంలో మూడు రకాల రక్తనాళాలు ఉంటాయి:

1. ధమనులు (Arteries):

హృదయం నుండి ఆక్సిజన్ కలిగిన రక్తాన్ని శరీర భాగాలకు తీసుకెళ్తాయి.
మందమైన గోడలు ఉండి అధిక పీడనాన్ని తట్టుకుంటాయి.

2. శిరలు (Veins):

శరీర భాగాల నుండి ఆక్సిజన్ లేని రక్తాన్ని హృదయానికి తీసుకువెళ్తాయి.
సన్నని గోడలు కలిగి ఉంటాయి.
కవాటాలు ఉంటాయి రక్తం వెనుకకు వెళ్లకుండా అడ్డుకుంటాయి.

3. రక్తకేశనాళికలు (Capillaries):

రక్తం మరియు కణజాలాల మధ్య వాయువుల (O₂, CO₂), పోషకాలు, వ్యర్థ పదార్థాల మార్పిడికి సహాయపడతాయి.
చాలా సన్నని, ఒక కణ మందంతో ఉన్న గోడలు కలిగి ఉంటాయి.

 12. a. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ పటము గీచి భాగములను గుర్తించుము.

(లేదా)

 

b) నాడీకణము పటము గీచి భాగములను గుర్తించుము.

 

13. మీకు ఒక పొడవు మొక్క ఇవ్వబడినది. అది సమయుగ్మజ పొడవు మొక్కనా లేదా విషమయుగ్మజ పొడవు మొక్కనా, అనేది ఎలా నిర్ధారిస్తావు?

 

ఒక పొడవు మొక్క (Tall plant) సమయుగ్మజ పొడవు మొక్కనా లేదా విషమయుగ్మజ పొడవు మొక్కనా, అనేది తెలుసుకోవడానికి, దానిని పొట్టి మొక్క (short plant – tt) తో సంకరణం చేస్తారు.

 

TT × tt క్రాస్:

t

t

T

Tt

Tt

T

Tt

Tt

 అన్ని సంతానం Tt (Tall)


అన్ని ఎత్తుగా ఉంటే , మనకు ఇవ్వబడిన మొక్క TT – సమయుగ్మజ పొడవు మొక్క.

 

 Tt × tt క్రాస్:

t

t

T

Tt

Tt

t

tt

tt


• 50% Tt (Tall)
• 50% tt (Short)

 

ఎత్తు + పొట్టి మొక్క రెండూ ఉంటే మనకు ఇవ్వబడిన మొక్క  Tt – విషమయుగ్మజ పొడవు మొక్క.

 

14. అలైంగిక ప్రత్యుత్పత్తి కంటే లైంగిక ప్రత్యుత్పత్తికి గల ప్రయోజనాలను పోల్చుము.

 

సంతతిలో వైవిధ్యం (variation) కలుగుతుంది.
వైవిధ్యం వలన జీవులు పరిసర మార్పులకు అనుకూలం అవుతాయి.
వ్యాధులు, వాతావరణ మార్పులు వంటి పరిస్థితుల్లో జాతి జీవన శాతం పెరుగుతుంది.
సహజ వరణం (natural selection) ద్వారా పరిణామ క్రియలకు సహాయపడుతుంది.
సంతతి జన్యపరంగా భిన్నంగా ఉండుట వలన లోపాలు వచ్చే ప్రమాదం తక్కువ.
మరింత దృఢమైన, ఆరోగ్యకరమైన తరం ఏర్పడటానికి సహాయపడుతుంది.

 

15.  మానవ శరీరంలోని అన్ని పనులను మెదడు మాత్రమే నియంత్రిస్తే ఏమి జరుగుతుంది?

శరీరంలోని అన్ని క్రియలు కేవలం మెదడు నియంత్రిస్తే, ప్రమాదకర పరిస్థితుల్లో శరీరం హాని పొందుతుంది.
మెదడు ప్రతిస్పందన ఆలస్యమవుతుంది కాబట్టి, అసంకల్పిత ప్రతీకార చర్యలు  (reflex actions) జరగవు.
ఉదాహరణకు: వేడిని తాకినప్పుడు వెంటనే చెయ్యి వెనక్కి తీసుకునే ప్రతిచర్య కావాలి.
ఇది మెదడు నియంత్రిస్తే సమయం ఎక్కువ పడుతుంది చెయ్యి కాలిపోవచ్చు.
అందుకే వెంటనే జరిగే ప్రతిచర్యలను వెన్నుపాము (spinal cord) నియంత్రిస్తుంది.
శరీరమంతటా నరాలు చేరలేకపోయినా, అంతః స్రావ గ్రంథుల హార్మోన్లు మాత్రం ప్రతి అవయవానికీ చేరగలవు.
కాబట్టి శరీరంలోని అన్ని పనులను మెదడు మాత్రమే నియంత్రించడం మంచిది కాదు.

 

విభాగం-IV    2 x 8 = 16

 

16. ) కిరణజన్య సంయోగక్రియ కొరకు పత్రహరితం అవసరం అని తెలియజేసే ప్రయోగ ప్రక్రియను రాయండి.

 

ఉద్దేశ్యం:  కిరణజన్య సంయోగ క్రియ (Photosynthesis) జరుగడానికి పత్రహరితం (Chlorophyll) అవసరమని నిరూపించడం.

 

అవసరమైనవి:

వేరువేరు రంగుల ఆకులు కలిగిన కుండి మొక్క
మరిగిన నీరు
ఆల్కహాల్
వాటర్ బాత్
అయోడిన్ ద్రావణం
బీకర్, ఫోర్స్‌ప్స్

 

విధానం:

మొక్కను మూడు రోజులపాటు చీకటి గదిలో ఉంచాలి.
(
ఆకుల్లోని మొత్తం పిండిపదార్థం వినియోగించబడుతుంది.)

మొక్కను మళ్లీ సుమారు ఆరు గంటలు సూర్యకాంతిలో ఉంచాలి.

మొక్క నుంచి ఒక ఆకు తీసుకుని అందులోని పచ్చని ప్రాంతాలు ఉన్న చోటులను గుర్తించాలి.
ఆకును మరిగిన నీటిలో కొన్ని నిమిషాలు ముంచి మృదువుగా చేయాలి.
తరువాత ఆకును ఆల్కహాల్ ఉన్న బీకర్‌లో పెట్టి వాటర్ బాత్‌లో వేడి చేయాలి.
(
ఆకులోని పత్రహరితం తొలగించడానికి.)

ఆల్కహాల్‌లో నుండి తీసిన ఆకును అయోడిన్ ద్రావణంలో ముంచాలి.

 

పరిశీలనలు:

ఆకుపచ్చని ప్రాంతాలునీలంనలుపు (blue-black) రంగులో మారుతాయి.
ఇవి పిండిపదార్థం (స్టార్చ్) ఉన్నాయని సూచిస్తుంది.

ఆకుపచ్చగా లేని  ప్రాంతాలులేతరంగులో ఉంటాయి.
ఇవి పిండిపదార్థం లేనట్టు సూచిస్తుంది.

 

నిర్ధారణ:

పిండిపదార్థం కేవలం పత్రహరితం ఉన్న ప్రాంతాలలో మాత్రమే ఏర్పడింది.
అందువల్ల కిరణజన్య సంయోగ క్రియకు పత్రహరితం (Chlorophyll) అత్యవసరం అని నిరూపితమవుతుంది.

 

(లేదా)

 

బి) మీ పాఠశాల ప్రయోగశాలలో రైజోపస్ సిద్ధబీజాలను పరిశీలించడానికి నీవు అవలంభించిన పద్ధతిని వివరించుము.

 

ఉద్దేశ్యం: బ్రెడ్ పై పెరిగే Rhizopus శిలీంద్రంలో స్పోర్లు (సిద్ధబీజాలను) ఏర్పడటాన్ని మరియు వాటి నిర్మాణాన్ని పరిశీలించడం.

 

అవసరమైన పదార్థాలు:

తడిగా ఉన్న బ్రెడ్ ముక్క
పెట్రి డిష్
మాగ్నిఫైయింగ్ గ్లాస్ / హ్యాండ్ లెన్స్
నీరు చల్లిన కాటన్ (తడిని నిల్వ చేయడానికి)

 

విధానం:

ఒక బ్రెడ్ ముక్కను స్వల్పంగా నీరు చల్లించి తడిగా చేయాలి.
బ్రెడ్ ముక్కను పెట్రి డిష్‌లో ఉంచాలి.
పెట్రి డిష్‌ను మూతపెట్టి, చల్లని, చీకటి ప్రదేశంలో 2 రోజులు ఉంచాలి.
(
ఇది శిలీంద్రం పెరుగుదలకు సహాయపడుతుంది.)

రెండు రోజుల తర్వాత, పెట్రి డిష్‌ను తెరిచి బ్రెడ్‌ను మాగ్నిఫైయింగ్ గ్లాస్ ద్వారా చూడాలి.
మొదట బ్రెడ్ పై తెల్లని దారంలాంటి శిలీంద్ర దేహం కనిపిస్తుంది.
తరువాత ఇది నలుపు రంగు స్పోరాంజియా గా మారుతుంది.

అవి పగిలినప్పుడు, లోపల ఉండే సిద్ధబీజాలను (reproductive spores) బయటకు వ్యాపిస్తాయి.


 

పరిశీలన:

మొదట బ్రెడ్‌పై తెల్లని శిలీంద్ర వృద్ధి కనిపించింది.
తరువాత ఇది నలుపు రంగు స్పోరాంజియాగా మారింది.
స్పోరాంజియం లోపల ఉన్న స్పోర్లు స్పష్టంగా కనిపించాయి.

 

నిర్ధారణ:

Rhizopus బ్రెడ్ పైన స్పోరాంజియా అనే నల్లని చిన్న గోళాలను ఏర్పరుస్తుంది.
ఇవి స్పోర్లు విడుదల చేసి శిలీంద్రం పునరుత్పత్తి కొనసాగుతుంది.
కనుక స్పోర్లు Rhizopus యొక్క వ్యాప్తి మరియు పునరుత్పత్తికి ముఖ్యమైన నిర్మాణాలు.

 

 

17. ) మానవులలో లింగ నిర్ధారణ ఎలా జరుగుతుందో విశ్లేషించండి.

 

మనుషుల్లో 23 జతల క్రొమోజోమ్‌లు ఉంటాయి.
వాటిలో 1 జత లింగ క్రొమోజోమ్‌లు (Sex chromosomes).
స్త్రీలు XX
పురుషులు XY

 

స్త్రీలు ఉత్పత్తి చేసే అండ కణాలు (egg cells) ఎల్లప్పుడూ X క్రొమోజోమ్ కలిగి ఉంటాయి.

పురుషులు ఉత్పత్తి చేసే వీర్యకణాలు (sperms) రెండురకాలుగా ఉంటాయి:
– X
క్రొమోజోమ్ కలిగినవి
– Y
క్రొమోజోమ్ కలిగినవి

 

 

Ø  X-శుక్రకణం  + అండం (X) → XX → ఆడ బిడ్డ

అండాన్ని X క్రొమోజోమ్ కలిగిన శుక్రకణం  ఫర్టిలైజ్ చేస్తే XX జత ఏర్పడి ఆడ శిశువు కలుగుతుంది.

Ø  Y-శుక్రకణం  + అండం (X) → XY → మగ బిడ్డ

అండాన్ని Y క్రొమోజోమ్ కలిగిన శుక్రకణం  ఫర్టిలైజ్ చేస్తే XY జత ఏర్పడి మగ శిశువు కలుగుతుంది.

 

 

శిశువు లింగం తండ్రి వల్ల నిర్ణయించబడుతుంది, ఎందుకంటే అతని వీర్యకణం X లేదా Y క్రొమోజోమ్ ను ఇస్తుంది.  తల్లి ఎల్లప్పుడూ X క్రొమోజోమ్ మాత్రమే ఇస్తుంది. కాబట్టి లింగ నిర్ధారణలో నిర్ణయాత్మక పాత్ర తండ్రిదే.

 

(లేదా)

 

బి) జంతువులలో నాడీ సంబంధ మరియు హార్మోను సంబంధ నియంత్రణ సమన్వయ యంత్రాంగాల మధ్య భేదాలు రాయండి.

 

నాడీ విధానం (Nervous Mechanism)

హార్మోన్ల విధానం (Hormonal / Endocrine Mechanism)

నాడీ వ్యవస్థ: మెదడు, వెన్నుపాము, నరాలు పనిచేస్తాయి.

అంతఃస్రావీ గ్రంధులు హార్మోన్లు స్రవిస్తాయి.

విద్యుత్ ప్రచోదనాలు ద్వారా సమాచారం మోసుకుపోతుంది.

రసాయన సమన్వయం (chemical messages) ద్వారా ప్రభావం చూపుతుంది.

ప్రతిస్పందన చాలా వేగంగా (తక్షణం) జరుగుతుంది.

ప్రతిస్పందన నెమ్మదిగా జరుగుతుంది.

ప్రభావం అల్పకాలం ఉంటుంది.

ప్రభావం దీర్ఘకాలం ఉంటుంది.

ప్రతీకార చర్యలు (reflex actions), కండరాల కదలికలు జరుగుతాయి.

పెరుగుదల, అభివృద్ధి, రక్త చక్కెర నియంత్రణ, మెటబాలిజం వంటి క్రియల్లో పాత్ర.

చర్యలు కేవలం నాడులు అనుసంధానించిన కణాలకే పరిమితం.

హార్మోన్లు రక్తంతో శరీరం అంతా వ్యాప్తి చెందుతాయి.

ప్రభావం శీఘ్రంగా మారుతుంది.

ప్రభావం మారడానికి ఎక్కువ సమయం పడుతుంది.

ఉదాహరణలు: సినాప్స్, న్యూరాన్, ప్రతీకార చర్యలు.

ఉదాహరణలు: థైరాక్సిన్, ఇన్సులిన్, అడ్రినలిన్, పెరుగుదల హార్మోన్.