10 FA 3 TM KEY 2026

 10 FA 3 TM KEY 2026

SECTION – A (1 మార్కు)

1) ఆవరణ వ్యవస్థలోని రెండు నిర్జీవ కారకాల పేర్లు వ్రాయుము.
  • గాలి

  • నీరు

  • నేల

2) ఇచ్చిన సమీకరణంలో చూపబడిన ప్రక్రియ ఏమిటి?

        



  • ఓజోన్ ఏర్పడటం

  • ఓజోన్ పొర ఏర్పడటం

3) UNEPను విస్తరించండి.

  • ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం

4) మానవుడు కేవలం వినియోగదారుడే. ఈ ప్రకటనను సమర్ధించండి.

  • మనుష్యుడు తన ఆహారాన్ని తాను తయారు చేసుకోలేడు

  • ఉత్పత్తిదారులపై ఆధారపడతాడు

  • ఇతర జీవులపై ఆహారం కోసం ఆధారపడతాడు

5) పర్యావరణ పరిరక్షణ గురించి ఒక నినాదము వ్రాయుము.

  • భూమిని రక్షించండి – మన భవిష్యత్తును కాపాడండి

  • ప్రకృతిని రక్షించండి – జీవాన్ని పరిరక్షించండి

SECTION – B (2 మార్కులు)

6) ఒక ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు లేకపోతే ఏమి జరుగుతుంది?

  • ఆహారపు గొలుసు లో అంతరాయం ఏర్పడుతుంది 

  • శక్తి ప్రవాహం ఆగిపోతుంది

  • ఆక్సిజన్ ఉత్పత్తి ఆగిపోతుంది

  • కార్బన్ డై ఆక్సైడ్ పెరుగుతుంది

  • ఆవరణ వ్యవస్థ పూర్తిగా కూలిపోతుంది

7) జైవిక వృద్ధీకరణ అంటే ఏమిటి?

  • హానికర రసాయనాల గాఢత ప్రతి పోషక స్థాయిలో పెరుగుతుంది. దీనినే జైవిక వృద్ధీకరణ అంటారు 

  • ఆహారపు గొలుసులో ఉన్నత స్థాయిలో ఎక్కువగా పేరుకుపోతుంది

8) ఆవరణ వ్యవస్థలో విచ్ఛిన్నకారుల పాత్ర ఏమిటి?

  • చనిపోయిన జీవులను విచ్ఛిన్నం చేస్తాయి 

  • వ్యర్థాల పేరుకుపోవడం నివారిస్తాయి 

  • పోషకాలను మట్టిలోకి తిరిగి చేరుస్తాయి 

  • నేల సారాన్ని కాపాడుతాయి 

SECTION – C (4 మార్కులు)

9) ఓజోన్ పొర నష్టాన్ని తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి?

  • పర్యావరణ అనుకూల పదార్థాలు వినియోగించాలి

  • CFCలు వంటి రసాయనాల వినియోగం నిలిపివేయాలి

  • గాలి కాలుష్యాన్ని తగ్గించాలి

  • ప్రజల్లో అవగాహన కల్పించాలి

10) జీవవిచ్ఛిన్నం చెందే మరియు జీవవిచ్ఛిన్నం కాని పదార్థాల మధ్య తేడాలు వ్రాయండి.

జీవవిచ్ఛిన్నం చెందే పదార్థాలు

జీవవిచ్ఛిన్నం కాని పదార్థాలు

తక్కువ కాలంలో విచ్ఛిన్నం అవుతాయి

చాలా కాలం పడుతుంది లేదా విచ్ఛిన్నం కావు

సూక్ష్మజీవులచే విచ్ఛిన్నం చేయబడతాయి

సూక్ష్మజీవులచే విచ్ఛిన్నం కావు

పర్యావరణానికి తక్కువ హాని కలిగిస్తాయి

నేల, నీరు, జీవులకు హాని కలిగిస్తాయి

ఉదా: ఆహార వ్యర్థాలు, కాగితం, ఆకులు, పత్తి

ఉదా: ప్లాస్టిక్, గాజు, లోహాలు, పురుగు మందులు


11) క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.



a) ప్రాథమిక వినియోగదారులు ఎవరి పై ఆధారపడతారు?

  • ఉత్పత్తిదారులు

b) పాము ఏ పోషక స్థాయికి చెందుతుంది?

  • ద్వితీయ వినియోగదారులు

c) పులి మేకను తింటే అది ఏ పోషక స్థాయికి చెందుతుంది?

  • ద్వితీయ వినియోగదారులు

d) స్వయంపోషకాలకు ఒక ఉదాహరణ ఇవ్వండి.

  • ఆకుపచ్చ మొక్కలు

  • ఆల్గీ

12) “ప్లాస్టిక్ కప్పుల కంటే పేపర్ కప్పులు వాడడం మంచిది” – సమర్థించండి.

  • పేపర్ కప్పులు జీవవిచ్ఛిన్నం అవుతాయి

  • ప్లాస్టిక్ కప్పులు కాలుష్యం కలిగిస్తాయి

  • పేపర్ కప్పులు ఆరోగ్యానికి సురక్షితం

  • పర్యావరణ అనుకూలమైనవి

SECTION – D (8 మార్కులు)

13) A) మీ ప్రాంతంలో వ్యర్థాలను తగ్గించడానికి పర్యావరణ అనుకూల పద్ధతులు సూచించండి.

  • జీవవిచ్ఛిన్నం అయ్యే మరియు కాని వ్యర్థాలను వేరు చేయాలి

  • సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తగ్గించాలి

  • కంపోస్టింగ్ చేయాలి

  • పునఃచక్రీయ చేయాలి

  • పాత వస్తువులను పునర్వినియోగించాలి

  • అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి

  • పేపర్, జ్యూట్ సంచులు వాడాలి

  • ప్రజా రవాణా వినియోగించాలి

(OR)

13) B) ఉత్పత్తిదారులు మరియు వినియోగదారుల మధ్య తేడాలు వ్రాయండి.

ఉత్పత్తిదారులు

వినియోగదారులు

సూర్యకాంతి, నీరు, CO₂ సమక్షంలో ఆహారం తయారు చేస్తారు

తమ ఆహారాన్ని తాము తయారు చేసుకోలేరు

స్వయంపోషకాలు

పరపోషకాలు

మొదటి పోషక స్థాయి

రెండవ, మూడవ, నాల్గవ పోషక స్థాయిలు

ఉదా: ఆకుపచ్చ మొక్కలు, ఆల్గీ

ఉదా: జంతువులు, మనుష్యులు