8 జీవశాస్త్రం - జంతువులలో ప్రత్యుత్పత్తి

 

8 CLASS జంతువులలో ప్రత్యుత్పత్తి

1. జీవులలో ప్రత్యుత్పత్తి ప్రాధాన్యతను వివరించండి.

Ans:
i.
ప్రత్యుత్పత్తి జీవులకు కొత్త సంతానం ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది.
ii.
ఇది జాతి మనుగడకు అవసరం.
iii.
నిరంతరంగా లక్షణాలు తరువాతి తరాలకు ప్రత్యుత్పత్తి ద్వారా కొనసాగుతాయి.

 

2. మానవులలో ఫలదీకరణ ప్రక్రియను వర్ణించండి.

Ans:
i.
ఫలదీకరణ అనేది అండం మరియు శుక్రకణం కలయిక.
ii.
శుక్రకణాలు పురుషాంగం ద్వారా విడుదలై స్త్రీ శరీరంలో ప్రవేశిస్తాయి.
iii.
వీటి కలయిక స్రీ బీజ వాహిక (ఫెలోపియన్ ట్యూబ్‌)లలో జరుగుతుంది.

iv. స్త్రీ జీవి శరీరం లోపల ఫలదీకరణం జరిగితే దానిని

అంతర ఫలదీకరణం అంటారు.
v.
ఫలితంగా సంయుక్త బీజం ఏర్పడుతుంది, ఇది పిండంగా అభివృద్ధి చెందుతుంది

 

3. సరైన సమాధానాన్ని ఎన్నుకోండి.

a) అంతర ఫలదీకరణం జరుగుతుంది:
i.
స్త్రీ జీవి శరీరం లోపల.

b) ప్రక్రియ ద్వారా చిరుకప్ప ప్రౌఢ కప్పగా అభివృద్ధి చెందుతుంది:
ii.
రూపవిక్రియ.

c) సంయుక్త వీజంలోని కేంద్రకాల సంఖ్య:
ii.
ఒకటి

 

4. కింది వాక్యాలు సత్యమా లేదా అసత్యమా అనీ తెలపండి.
ఎ) అండోత్పాడకాలు పిల్లలను కంటాయి. (F)

వి శుక్రకణము ఒక ఏకకణము.(T)

సి) కప్పలో బాహ్య ఫలదీకరణము జరుగుతుంది.(T)

డి) సంయోగ వీజమనే కణము నుండి మానవుడు ఏర్పడతాడు.(F)

ఇ) ఫలదీకరణము చెందిన తర్వాత పెట్టబడిన గుడ్డు ఒకే కణముచే ఏర్పడింది.(T)

ఎఫ్‌) అమీబా కోరకీభవనము ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతుంది.(F)

జి) అలైంగిక ప్రత్యుతృత్తిలో ఫలదీకరణము ఒక అత్యవసర ఘట్టం.(F)

హెచ్) ద్విధావిచ్చిత్తి ఒక అలైంగిక ప్రత్యుత్పత్తి విధానము(T)

ఐ) ఫలదీకరణ ఫలితముగా సంయుక్త వీజము ఏర్పడుతుంది.(T)

జె) పిండము ఏకకణముతో ఏర్పడుతుంది(F)

 

5. సంయుక్త వీజమునకు, ట్రూణమునకు గల రెండు బేధాలను తెలపండి.. ( ఏవైనా రెండు నేర్చుకోండి )

 

6. అలైంగిక ప్రత్యుత్పత్తిని నిర్వచించి, జంతువులలో గల రెండు అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలను వర్ణించండి.

అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది ఒకే జీవి నుంచి సంయోగ బీజ కణాల కలయిక లేకుండా సంతానం ఉత్పత్తి కావడం.

జంతువులలోని రెండు అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలు:

i. ద్విధావిచ్చిత్తి (Binary Fission):
ఏక కణజీవి, ఉదాహరణకు అమీబా, తన కణాన్ని రెండు సమాన భాగాలుగా విభజించుకొని సంతానం ఉత్పత్తి చేస్తుంది.

ii. హైడ్రాలో కోరకీభవనం (Budding in Hydra):
హైడ్రా అనే జంతువులో కోరకీభవనం అనేది ఒక అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం. ప్రక్రియలో, హైడ్రా శరీరంపై చిన్న బొడిపెలు  (buds) ఏర్పడతాయి. బొడిపెలు  హైడ్రా తల్లి శరీరంతోనే నూతన జీవిగా అభివృద్ధి చెందుతాయి.  పెరుగుతూ తల్లి జీవి నుండి వేరుపడి, ఒక కొత్త హైడ్రాగా మారుతుంది.

 

7. స్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని అవయవంలో పిండము అతుక్కుంటుంది?

Ans:  పిండం గర్భాశయ గోడలకు అతుక్కుంటుంది.

 

8. రూపవిక్రియ అంటే ఏమిటి? ఉదాహరణలు ఇవ్వండి.

రూపవిక్రియ (Metamorphosis):
రూపవిక్రియ అనేది జీవి జీవన చక్రంలో ఒక దశ నుండి మరొక దశకు మారడంలో సంభవించే శారీరక మార్పుల ప్రక్రియ. ప్రక్రియలో జీవి దాని రూపంలో గణనీయమైన మార్పులను చూపిస్తుంది.

ఉదాహరణలు:
i. 
గొంగళి  పురుగు (larva) నుండి సీతాకోక చిలుక మారడం.
ii.
కప్పలు: గుడ్డు  నుండి టాడ్ పోల్ , తర్వాత కప్పగా మారడం.

 

9. అంతర ఫలదీకరణము మరియు బాహ్య ఫలదీకరణములకు మధ్య గల భేదములను తెలపండి.

 

 

10. కేలిని కింద ఇవ్వబడిన ఆధారాల సహాయంతో పూర్తి చేయండి.

అడ్డం

1. కోడిలో ఫలదీకరణ విధానం. (అంతర ఫలదీకరణం)

2. పరస్థానిక ఫలదీకరణానికి మరొక పేరు. (ఐ వి ఫ్)

8. శుక్రకణాలు ఉత్పత్తి అయ్యే పురుష ప్రత్యుత్పత్తి భాగాలు. (ముష్కాలు)

నిలువు

1. ఈ జంతువులు గుడ్లు పెడతాయి. (అండోత్పదకాలు )

4. అండాలు ఇక్కడ ఏర్పడతాయి. (స్తీబీజకోశం)

5. హైడ్రా శరీరపు పార్శ్వ అంచులలో కనిపించే బొడిపెలను సూచించే పదం.(కోరకాలు)

6. సంయోగ వీజాలు కలిసే ప్రక్రియ. ( ఫలదీకరణం)

7. అమీబాలో జరిగే విచ్చిత్తి. ( ద్విధావిచ్చిత్తి)