8 జీవశాస్త్రం - సూక్ష్మజీవులు: స్నేహితులు - శత్రువులు

  8  జీవశాస్త్రం - సూక్ష్మజీవులు: స్నేహితులు - శత్రువులు

1. ఖాళీలు పూరించండి.

() సూక్ష్మజీవులను సూక్ష్మదర్శిని (Microscope) సహాయంతో చూడవచ్చు.
(
బి) నీలి ఆకుపచ్చ శైవలాలు భూసారాన్ని పెంచడానికి గాలి నుండి నేరుగా నత్రజనిని (Nitrogen) ను గ్రహించి స్థాపన చేస్తాయి.

(సి) ఆల్కహాల్ సు ఈస్ట్ (Yeast) సహాయంతో ఉత్పత్తి చేస్తారు.
(
డి) విబ్రియో కలరా (Vibrio cholerae) అనే బాక్టీరియా వలన కలరా వ్యాధి కలుగుతుంది.

2. సరైన సమాధానాన్ని టిక్ చేయండి.

() ఈస్ట్‌ను ఉపయోగించే ఉత్పత్తి:

  • () ఆల్కహాల్ (alcohol)

(బి) క్రిందివాటిలో సూక్ష్మజీవనాశకం (Antibiotic):

  • () స్ట్రెప్టోమైసిన్ (Streptomycin)

(సి) మలేరియా కలిగించే ప్రోటోజోవా యొక్క వాహకము:

  • () ఆడ అనాఫిలిస్ దోమ (female Anopheles mosquito)

(డి) అంటువ్యాధులకు అత్యంత సాధారణ వాహకము:

  • () ఈగ (housefly)

() బ్రెడ్ లేదా ఇడ్లీ పిండి ఉబ్బిపోవడానికి కారణం:

  • () ఈస్ట్ కణాల పెరుగుదల (growth of yeast cells)

(ఎఫ్) చక్కెరను ఆల్కహాల్‌గా మారుస్తే దాన్ని అంటారు:

  • () కిణ్వనం (fermentation)

3. జతపరచండి:

A

B

(i) బాక్టీరియా

(e) కలరా కలిగించుట

(ii) రైజోబియం

(a) నత్రజని స్థాపన

(iii) లాక్టోబాసిల్లస్

(b) పెరుగు ఏర్పరచడం

(iv) ఈస్టు

(c) బ్రెడ్ తయారీ

(v) ఒక ప్రోటోజోవన్

(d) మలేరియా కలిగించుట

(vi) ఒక వైరస్

(f) ఎయిడ్స్ కలిగించుట

4. సూక్ష్మజీవులను కంటితో చూడవచ్చా? చూడలేకపోతే, వాటిని ఎలా చూడాలి?

సూక్ష్మజీవులు చాలా చిన్నవిగా ఉండి, వాటిని మామూలు కంటితో చూడడం సాధ్యం కాదు. వాటిని సూక్ష్మదర్శిని (Microscope) సహాయంతో మాత్రమే చూడగలము.

5. సూక్ష్మజీవుల ప్రధాన సమూహాలు ఏవి?

సూక్ష్మజీవులు ప్రధానంగా ఐదు వర్గాలుగా విభజించబడ్డాయి:

1.        బాక్టీరియా (Bacteria)

2.        శిలీంధ్రాలు (Fungi)

3.        ప్రోటోజోవాలు (Protozoa)

4.        శైవలాలు (Algae)

5.        వైరస్లు (Viruses)

6. గాలిలోని నత్రజనిని నేలలో స్థాపించగల సూక్ష్మజీవుల పేర్లు తెలపండి.

రైజోబియం (Rhizobium), నాస్టాక్, అనాబినా అనే సూక్ష్మజీవులు  వాతావరణంలోని నత్రజనిని స్థాపించి భూసారాన్ని పెంచుతాయి.

7. మన జీవితంలో సూక్ష్మజీవుల ఉపయోగాలపై 10 పంక్తులు రాయండి.

I.సూక్ష్మజీవులు పెరుగు తయారీలో ఉపయోగపడతాయి; లాక్టోబాసిల్లస్ అనే బాక్టీరియా పాలను పెరుగు మార్చుతుంది.

II.ఈస్ట్ అనే సూక్ష్మజీవి బ్రెడ్, కేక్ తయారీలో పిండిని ఉబ్బించేందుకు ఉపయోగిస్తారు.

III.కొన్ని బాక్టీరియా మరియు శిలీంధ్రాల వలన సూక్ష్మజీవనాశకాలు తయారవుతాయి (ఉదా: పెన్సిలిన్, స్ట్రెప్టోమైసిన్).

IV.సూక్ష్మజీవులు ఆల్కహాల్, వెనిగర్, వైన్ వంటి పదార్థాల వాణిజ్య ఉత్పత్తికి ఉపయోగపడతాయి.

V. రైజోబియం వంటి బాక్టీరియా వాతావరణ నత్రజనిని నేలలో స్థాపించి భూసారాన్ని పెంచుతుంది.

VI కొన్ని సూక్ష్మజీవులు వ్యాధికారక జీవులపై ప్రతిరక్షకాలు ఉత్పత్తి చేయడంలో ఉపయోగపడతాయి.

VII.వ్యాధులను నివారించేందుకు వ్యాక్సిన్లు తయారుచేసే ప్రక్రియలో సూక్ష్మజీవులు కీలక పాత్ర పోషిస్తాయి.

VIII.సూక్ష్మజీవులు మృత మొక్కలు మరియు జంతువుల అవశేషాలను విచ్ఛిన్నం చేసి సరళ పదార్థాలుగా మార్చుతాయి.

IX.పశు, పౌల్ట్రీ పోషణలో సూక్ష్మజీవనాశకాలు మిళితం చేసి వ్యాధులను నివారించవచ్చు.

X.పర్యావరణంలో వ్యర్థాలను విచ్ఛిన్నం చేయడం ద్వారా సూక్ష్మజీవులు పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుతాయి.

8. సూక్ష్మజీవుల వల్ల కలిగే హాని గురించి ఒక చిన్న పేరా రాయండి.

సూక్ష్మజీవులు మనుషులు మరియు జంతువుల్లో వ్యాధులను కలిగిస్తాయి. ఉదాహరణకు, మానవునికి కలరా అనే వ్యాధి విబ్రియో కలరా (Vibrio cholera) అనే బాక్టీరియాను వలన కలుగుతుంది. జంతువులలో వైరస్ వల్ల గాలికుంటు వ్యాధి, బాక్టీరియా వలన ఆంత్రాక్స్ ఏర్పడుతుంది. కొన్ని సూక్ష్మజీవులు ఆహార పదార్థాలను కుళ్ళబెట్టి పాడుచేస్తాయి. కొన్ని సూక్ష్మజీవులు తోలు మరియు బట్టలను కూడా పాడుచేస్తాయి. ఇవే కాకుండా, పాడైన ఆహారం వలన ఫుడ్ పాయిజనింగ్ (ఆహారం విషతుల్యం కావడం) కలుగుతుంది.

9. సూక్ష్మజీవనాశకాలు అంటే ఏమిటి? వాటిని వినియోగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

వ్యాధికారక సూక్ష్మజీవులను చంపేందుకు లేదా వాటి పెరుగుదలని అడ్డుకోవడానికి ఉపయోగించే రసాయన పదార్థాలను సూక్ష్మజీవనాశకాలు (Antibiotics) అంటారు. ఇవి ముఖ్యంగా బాక్టీరియా మరియు శిలీంధ్రాల నుండి తయారవుతాయి.
వాటిని వాడేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు:

  • సూక్ష్మజీవనాశకాలను అర్హత కలిగిన వైద్యుడి సలహా మేరకే తీసుకోవాలి.
  • డాక్టర్ సూచించిన పూర్తి కోర్సును పూర్తిగా తీసుకోవాలి.
  • అవసరం లేకుండా తీసుకుంటే, తర్వాతి కాలంలో ఆ  ఔషధం ప్రభావం తగ్గిపోవచ్చు.
  • తప్పుడు మోతాదులో తీసుకుంటే, శరీరంలో ఉన్న ప్రయోజనకరమైన బాక్టీరియా కూడా నశించవచ్చు.