8 జీవశాస్త్రం కౌమార దశ .

 8 జీవశాస్త్రం    కౌమార దశ   .      

1. శరీరంలో మార్పులకు కారణమయ్యే అంతఃస్రావక గ్రంథుల రసాయన స్రావాలను ఏమంటారు? 

అంతఃస్రావ గ్రంథులు స్రవించే రసాయన పదార్థాలను హార్మోన్లు అంటారు. హార్మోన్లు శరీరంలో జరిగే మార్పులకు కారణమవుతాయి.

2. కౌమార దశను నిర్వచించండి. 

యవ్వనదశ మరియు యుక్త వయస్సు మధ్య వచ్చే దశను కౌమార దశ అంటారు. దశలో శరీరం పునరుత్పత్తి పరిపక్వతను సాధిస్తూ వివిధ మార్పులకు లోనవుతుంది. ఇది సుమారు 11 సంవత్సరాల వయస్సులో ప్రారంభమై, 18 లేదా 19 సంవత్సరాల వయస్సులో ముగుస్తుంది. కాలం వ్యక్తి వ్యక్తికి భిన్నంగా ఉంటుంది.

3. ఋతుచక్రం అంటే ఏమిటి? వివరించండి. 

గర్భాశయం లోపలి పొరను ప్రతినెల సాదారణంగా తొలగించుకునే ప్రక్రియను ఋతుచక్రం అంటారు. ఇది యుక్త వయస్సులో ప్రారంభమై స్త్రీ శరీరంలోని పునరుత్పత్తి చక్రంలో జరుగుతుంది. గర్భాశయం ప్రతినెల ఫలదీకరణ అయిన అండాన్ని స్వీకరించేందుకు సిద్ధమవుతుంది. దీనివల్ల గర్భాశయ గోడలు మందంగా మారి రక్తసరఫరాతో అభ్రివృద్ధి చెందుతాయి. అండం ఫలదీకరణం కానప్పుడు, గర్భాశయ గోడలు విచ్ఛిన్నమై రక్త రూపంలో యోనిమార్గం ద్వారా బయటకు విడిచి వేస్తుంది.. నెలసరి(28 రోజుల) చక్రాన్ని ఋతుచక్రం అంటారు.

4. యుక్త వయస్సులో శరీరంలో చోటు చేసుకునే మార్పుల జాబితా తయారు చేయండి. 

a) శరీర ఎత్తు మరియు బరువు హఠాత్తుగా పెరుగుతుంది. 

b) కాళ్లు, చేతులు, ముఖం మరియు చేతి కింద భాగాల్లో రోమాలు పెరుగుతాయి. 

c) స్త్రీలలో అండాశయాలు పెద్దవిగా మారి పరిపక్వమైన అండాలను ఉత్పత్తి చేస్తాయి, పురుషులలో ముష్కాలు అభివృద్ధి చెంది శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి. 

d) పురుషులలో భుజాలు వెడల్పు అవుతాయి, ఛాతీ విశాలంగా మారుతుంది; స్త్రీలలో నడుము క్రింద భాగం వెడల్పు అవుతుంది. 

e) చర్మం నుండి చమురు అధికంగా స్రవించడం వల్ల మొటిమలు ఏర్పడతాయి. 

f) హార్మోన్ల ప్రభావం వల్ల బాలురలో శబ్దపేటిక (లారింక్స్) పెద్దగా మారుతుంది. స్వరతంత్రులు  పొడవుగా, మందంగా మారి గొంతు బొంగురుగా వినిపిస్తుంది.

5. అంతఃస్రావ గ్రంథుల పేర్లు మరియు వాటి హార్మోన్లను చూపే పట్టిక తయారు చేయండి. 

అంతఃస్రావ గ్రంథులు

స్రవించే హార్మోన్లు

ముష్కాలు

టెస్టోస్టీరాన్

స్త్రీ బీజకోశాలు

ఈస్ట్రోజెన్

పీయూష గ్రంథి

ఎదుగుదల హార్మోన్

అధివృక్క గ్రంథి

అడ్రినలిన్

థైరాయిడ్ గ్రంథి

థైరాక్సిన్

క్లోమ గ్రంథి

ఇన్సులిన్

 

6. లైంగిక హార్మోన్లు అంటే ఏమిటి? వాటికి పేరును ఎందుకు పెట్టారు? వాటి విధులను వివరించండి. 

లైంగిక అవయవాల ద్వారా ఉత్పత్తి అయ్యే రసాయన పదార్థాలను లైంగిక హార్మోన్లు అంటారు. ఉదాహరణకు: 

·          స్త్రీలలో స్త్రీ బీజకోశాలు ఉత్పత్తి చేసే లైంగిక హార్మోన్ ఈస్ట్రోజెన్ 

·          పురుషులలో ముష్కాలు ఉత్పత్తి చేసే లైంగిక హార్మోన్ టెస్టోస్టీరాన్ 

 లైంగిక హార్మోన్ల విధులు: 

Ø  ఈస్ట్రోజెన్: 

·          ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధికి కారణమవుతుంది. 

·          వక్షోజాల ఎదుగుదల, స్త్రీ పునరుత్పత్తి అవయవాల అభివృద్ధి వంటి మార్పులకు కారణం. 

Ø  టెస్టోస్టీరాన్: 

·          అబ్బాయిలలో ద్వితీయ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. 

·          గడ్డం, మీసాలు పెరగడం, గొంతు బొంగురుగా మారడం, పురుష పునరుత్పత్తి అవయవాల అభివృద్ధి. 

7. సరైన సమాధానాన్ని ఎంచుకోండి.

 () కౌమారులు తాము తినే ఆహారం గురించి జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే
(ii)
వారి శరీరంలో జరుగుతున్న వేగవంతమైన ఎదుగుదలకు సరైన ఆహారం అవసరం.

(బి) మహిళల్లో పునరుత్పత్తి ప్రారంభమయ్యే వయస్సు.
(i)
ఋతుస్రావం మొదలయినపుడు.

(సి) కౌమారులకు అవసరమైన భోజనంలో ఇవి ఉండాలి.
(ii)
చపాతీ, పప్పు, కూరగాయలు.

8. కింది వాటి గురించి రాయండి: 

() ఆడమ్స్ ఆపిల్: 

ఆడమ్స్ ఆపిల్ అనేది బాలురలో యుక్త వయస్సు సమయంలో శబ్దపేటిక (లారింక్స్) అభివృద్ధి చెందడంలో ఏర్పడే నిర్మాణం. ఇది గొంతు భాగంలో బయటికి పొడుచుకుని కనిపిస్తుంది. హార్మోన్ల ప్రభావం వల్ల శబ్దపేటిక పెద్దదవడం జరుగుతుంది, దీని వలన గొంతు శబ్దం బొంగురుగా మారుతుంది. 

(బి) ద్వితీయ లైంగిక లక్షణాలు: 

ఇవి బాలబాలికల్లో యుక్త వయస్సు సమయంలో కనిపించే శారీరక మార్పులు. 

Ø  స్త్రీలలో: 

·          వక్షోజాల అభివృద్ధి. 

·          నడుము క్రింద భాగం వెడల్పు అవడం. 

·          కండరాల స్థూలత తక్కువగా ఉండడం. 

·          ఋతుచక్రం ప్రారంభం కావడం.

·          జననాంగ ప్రాంతాల్లో రోమాలు పెరగడం.

Ø  పురుషులలో: 

·          మీసాలు, గడ్డం, జననాంగ ప్రాంతాల్లో రోమాలు పెరగడం.

·          శరీరంలోని మరి కొన్ని ప్రదేశాల్లో రోమాలు పెరగడం (చంకలు, తొడల భాగం). 

·          గొంతు బొంగురంగా మారడం.

·          భుజాలు వెడల్పు అవడం, ఛాతీ విస్తరించడం. 

(సి) పుట్టబోయే బిడ్డలో లింగ నిర్ధారణ:

          I.            పురుషుడి జెనిటిక్ నిర్మాణం: 44 ఆటోసోమ్స్ + XY క్రోమోజోములు.

        II.            శుక్రకణం: X లేదా Y క్రోమోజోమ్ను కలిగి ఉండవచ్చు.

       III.            స్త్రీ జెనిటిక్ నిర్మాణం: 44 ఆటోసోమ్స్ + XX క్రోమోజోములు.

       IV.            అండం: ఎల్లప్పుడూ X క్రోమోజోమ్ను కలిగి ఉంటుంది.

        V.            పుట్టబోయే బిడ్డ యొక్క లింగాన్ని సంయుక్తబీజంలో (జైగోట్) ఉన్న లైంగిక క్రోమోజోములు నిర్ణయిస్తాయి.

      VI.             శుక్రకణం Y క్రోమోజోమ్ను అందించగలిగితే, పుట్టబోయే బిడ్డ మగబిడ్డ శుక్రకణం X క్రోమోజోమ్ను అందించగలిగితే, పుట్టబోయే బిడ్డ ఆడబిడ్డ లైంగికతను తండ్రి క్రోమోజోములు నిర్ణయిస్తాయి, తల్లి దీనికి బాధ్యురాలు కాదు.