SELF ASSESSMENT – సెమిస్టర్-1 మోడల్ పేపర్ (2025–26)
తరగతి : 9 విషయం : Biological Science (జీవశాస్త్రం)
ప్రశ్నలు : 17 పూర్తి మార్కులు : 40 సమయం : 1 గం 30 ని
SECTION – A : బహుళైచ్ఛిక ప్రశ్నలు
(ప్రతి ప్రశ్నకు 1 మార్కు – మొత్తం 10 మార్కులు)
1.
ఇవ్వబడిన
చిత్రంలో ‘X’
గా సూచించబడిన నిర్మాణాన్ని గుర్తించండి.
A)
కేంద్రకం
B) న్యూక్లియాయిడ్
C) గాల్జీ సంక్లిష్టం
D) రైబోసోమ్లు
[ B ]
2.
Assertion–Reason ప్రశ్న
ప్రకటన (A): కణం యొక్క ఆకారం మరియు పరిమాణం దాని విధితో సంబంధం కలిగి ఉంటాయి.
కారణం (R): నాడీకణానికి శాఖాయుతమైన నిర్మాణం ఉండటం వలన దేహమంతటా సమాచారం ప్రసారం చేయగలుగుతుంది.
A)
A సరైనది,
R తప్పు
B) A తప్పు,
R సరైనది
C) రెండూ సరైనవి కానీ పరస్పరం సంబంధం లేదు
D) రెండూ సరైనవి మరియు R, Aకి
సరైన వివరణ
[ D
]
3.
బాహ్యద్రవాభిసరణ (Exosmosis) ప్రయోగం చేయడానికి ఏ పదార్థాలు ఉపయోగిస్తారు?
A)
ఉడకబెట్టిన గుడ్డు,
పంచదార ద్రావణం,
బీకరు
B) పెంకు తీసిన గుడ్డు,
పంపు నీరు,
బీకరు
C) పెంకు తీసిన గుడ్డు,
ఉప్పు నీటి ద్రావణం,
బీకరు
D) పెంకు తీసిన గుడ్డు,
వెనిగర్,
బీకరు
[ C
]
4.
అంతర్జీవ ద్రవ్యజాలం (ER)
గురించి సరికాని ప్రకటన ఏది?
A)
గరుకు ER లో ప్రోటీన్ సంశ్లేషణ జరుగుతుంది
B) నునుపు ER విషపదార్థాలను
నిర్వీర్యం చేస్తుంది
C) నునుపు ER చెక్కెరలు
మరియు ప్రోటీన్లు నిల్వ చేసి రవాణా చేస్తుంది
D) రైబోసోమ్లు ఉన్నది గరుకు ER అంటారు
[ C ]
5.
కణకవచం (Cell Wall) కలిగిన కణాలు ఏవి?
- వృక్ష కణం
- శిలీంధ్ర కణం
- బ్యాక్టీరియా కణం
- ఎర్ర రక్త కణం
A)
1 & 3 B) 1, 2 & 3 C) 1, 2, 3 & 4 D) 2 & 4
[ B
]
6.
కాండం మరియు వేర్లలో ఆహారాన్ని నిల్వ చేసే కణజాలం ఏది?
A)
స్థూలకోణ కణజాలం
B) దారు కణజాలం (Xylem)
C) మృదు కణజాలం (Parenchyma)
D) పోషక కణజాలం (Phloem)
[ C
]
7.
ఒకవేళ వైరస్‌లకు తమ స్వంత త్వచం మరియు కణ యంత్రాంగం ఉంటే,
ఎక్కువగా ఏ మార్పు జరగవచ్చు?
A)
అతిధేయి (Host) అవసరం
లేకుండానే ప్రత్యుత్పత్తి చేస్తాయి
B) అవి హానికరం కానివిగా మారతాయి
C) సూక్ష్మదర్శిని లేకుండానే కనిపిస్తాయి
D) పూర్తిగా ప్రత్యుత్పత్తి ఆపేయబడుతుంది
[ A
]
8.
టండ్రా ప్రాంతాల్లో నివసించే ఎస్కిమోలకు చర్మం క్రింద మందమైన అడిపోజ్ పొర ఎందుకు ఉంటుంది?
A)
చలిలో కండరాలు వేగంగా పనిచేయడానికి
B) ఎక్కువ ఆక్సిజన్ నిల్వ చేయడానికి
C) ఉష్ణనష్టాన్ని తగ్గించి ఇన్సులేటర్‌గా పనిచేయడానికి
D) చర్మం బలంగా మారడానికి
[ C
]
9.
దృఢ కణజాలం (Sclerenchyma)
మరియు దారు కణజాలం (Xylem) మధ్య సరైన ప్రకటనలు ఎవరివి?
·
మేఘన: దృఢ కణజాల కణాలు మందమైన గోడలతో ఉంటాయి;
దారు కణాలలో పలుచని గోడలు
·
నీలిమ: దృఢ కణజాలం జీవకణాలతో,
దారు కణజాలం నిర్జీవకణాలతో
·
రఘు: దృఢ కణజాలం సరళ కణజాలం;
దారు కణజాలం సంక్లిష్ట కణజాలం
·
మనోజ్: దృఢ కణజాలం దృఢత్వం ఇస్తుంది;
దారు కణజాలం రవాణా + దృఢత్వం ఇస్తుంది
A)
మేఘన
& నీలిమ
B) రఘు
& మనోజ్
C) నీలిమ
& రఘు
D) మేఘన
& మనోజ్
[ B
]
10.
సరియైన జోడిని గుర్తించండి.
a)
లిగమెంట్ – ఎముకలను కలుపుతుంది
b) అరియోలార్ కణజాలం – కొవ్వు నిల్వ
c) ఎముక – ఆధారం,
రూపం ఇస్తుంది
d) టెండాన్ – కండరాలను కలుపుతుంది
A)
a & b
B) b & c
C) a, c & d
D) a & c
[ D
]
SECTION – B (3 × 2 = 6 మార్కులు)
11. హృదయ కండరాలను బలపరుచుకోవడానికి రెండు సూచనలు వ్రాయండి.
- ప్రతిరోజూ 30 నిమిషాలు నడక/జాగింగ్/సైక్లింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి.
- కొవ్వు తక్కువగా, పండ్లు–కూరగాయలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి.
- ఉప్పు, జంక్ ఫుడ్, ఒత్తిడిని తగ్గించాలి.
(2
పాయింట్లు మాత్రమే
రాస్తే సరిపోతుంది)
12. కేంద్రకపూర్వక (Prokaryotic) మరియు నిజకేంద్రక (Eukaryotic) కణాల మధ్య తేడాలు
|
కేంద్రక పూర్వ కణం (Prokaryotic Cell) |
నిజ కేంద్రక కణం (Eukaryotic Cell) |
|
1.
పరిమాణం: చిన్నది (1-10 μm) |
1.
పరిమాణం: పెద్దది (5-100 μm) |
|
2. కేంద్రక త్వచం లేనందున, కేంద్రక ప్రాంతం స్పష్టంగా ఉండదు. దీనిని న్యూక్లియాయిడ్ అంటారు. |
2. కేంద్రకం స్పష్టంగా ఉండి, కేంద్రక త్వచంతో ఆవరించబడి ఉంటుంది. |
|
3. ఒకే ఒక్క క్రోమోసోమ్ ఉంటుంది. |
3. ఒకటి కంటే ఎక్కువ క్రోమోసోములు ఉంటాయి. |
|
4. త్వచంతో కప్పబడిన కణాంగాలు లేవు. |
4. త్వచంతో కప్పబడిన కణాంగాలు ఉంటాయి. |
(2
పాయింట్లు మాత్రమే
రాస్తే సరిపోతుంది)
13.
పేర్లు వ్రాయండి
i)
నోటి కుహరం లోపలి పొర నిర్మించే కణజాలం
·
శల్కల
ఉపకళా కణజాలం (squamous
epithelium)
ii)
ద్రవ మాత్రిక కలిగిన సంయోజక కణజాలం
- రక్తం (Blood)
SECTION – C (2 × 4 = 8 మార్కులు)
14. దైనందిన జీవితంలో వ్యాపనం (Diffusion) ఉపయోగించే 4 ఉదాహరణలు వ్రాయండి.
i.
అగరబత్తి
వాసన గదిలో అన్ని వైపులా పాకడం.
ii.
వంటలో
ఉప్పు,
మసాలాల రుచి కూరలో సమంగా కలవడం.
iii.
నీటిలో
ఇంకు (ink) చుక్క వేసినప్పుడు అది నెమ్మదిగా నీటిలో అంతా పాకడం.
iv.
ఊపిరితిత్తుల్లో
ఆక్సిజన్ రక్తంలోకి ప్రవేశించడం,
కార్బన్‌డయాక్సైడ్ బయటకు రావడం.
15. వృక్షకణం పటం గీచి భాగాలను గుర్తించండి.
SECTION – D (2 × 8 = 16 మార్కులు)
16. A) ఒక కణంలో ఉన్న 4 కణాంగాలను వ్రాసి వాటి విధులను తెలపండి.
|
కణాంగం |
విధులు |
|
కేంద్రకం (Nucleus) |
• కణంలోని అన్ని చర్యలను నియంత్రిస్తుంది. |
|
మైటోకాండ్రియా (Mitochondria) |
• కణానికి శక్తిని ఉత్పత్తి చేస్తుంది (ATP). |
|
ఎండోప్లాజ్మిక్ రేటిక్యులం (ER) |
• కణంలో పదార్థాల సంశ్లేషణ మరియు రవాణా చేస్తుంది. |
|
గాల్జీ దేహం (Golgi apparatus) |
• ప్రోటీన్లు మరియు లిపిడ్లను ప్యాక్ చేసి రవాణా చేస్తుంది. |
లేదా
B) వివిధ రకాల కండర కణజాలాల మధ్య తేడాలను వ్రాయండి.
|
లక్షణం |
రేఖిత కండరాలు |
అరేఖిత కండరాలు |
హృదయ కండరాలు |
|
కణాల ఆకారం |
పొడవైన, ఉమ్మడి, సిలిండర్ ఆకారం (long, cylindrical, unbranched) |
పొడవైనవి, చివరలు సుడులుగా ఉండే స్పిండిల్ ఆకారం (spindle-shaped) |
సిలిండర్ ఆకారం, శాఖాయుతంగా (branched) ఉంటాయి |
|
కేంద్రకాల సంఖ్య |
బహు కేంద్రకాలు (multinucleate) |
ఒకే కేంద్రకం (uninucleate) |
ఒక కేంద్రకం (uninucleate) |
|
గీతలు / రేఖలు |
గీతలు ఉంటాయి (striated) |
గీతలు ఉండవు (unstriated) |
గీతలు ఉంటాయి (striated) |
|
నియంత్రణ |
సంకల్పాధీన (voluntary) |
అసంకల్పిత (involuntary) |
అసంకల్పిత (involuntary) |
|
స్థానం |
ఎముకలకు అతుక్కున్న కండరాలు |
ప్రేగులు, రక్తనాళాలు, మూత్రనాళం, కంటి ఐరిస్ |
హృదయంలో మాత్రమే |
|
విధి |
శరీర కదలికలు కలిగిస్తుంది |
అంతర్గత అవయవాల కదలికలు నియంత్రిస్తుంది |
హృదయం రిత్యమిక్‌గా సంకోచ సడలికలు చేయడానికి సహాయం చేస్తుంది |
17. A) మొక్కలోని వివిధ రకాల కణజాలాలను పరిశీలించడానికి అనుసరించిన విధానాన్ని వ్రాయండి.
ఉద్దేశ్యం (Aim):
లేత మొక్క కాండం సన్నని ముక్క ను తీసుకొని వివిధరకాల కణజాలాలు ను సూక్ష్మదర్శినిలో
పరిశీలించడం.
పరికరాలు (Materials Required):
- లేత మొక్క కాండం
- safranin
- స్లైడ్, కవర్‌స్లిప్
- గ్లిసరిన్
- సూక్ష్మదర్శిని
విధానం (Procedure):
- ఉపాధ్యాయుని సహాయంతో లేత మొక్క కాండం ను సన్నని ముక్కలుగా కోయండి.
- ఆ సన్నని ముక్కలను safranin లో కొద్దిసేపు ఉంచండి.
- ఒక సన్నని ముక్కను స్లైడ్ పై ఉంచి ఒక చుక్క గ్లిసరిన్ వేయండి.
- పైకి కవర్‌స్లిప్ మెల్లగా ఉంచండి.
- స్లైడ్‌ను సూక్ష్మదర్శినిలో పరిశీలించండి.
- కణాలు, వారి నిర్మాణం, వ్యవస్థ ను గమనించండి.
పరిశీలనలు (Observation):
·
వేర్వేరు
రకాలు కణాలు కనిపిస్తాయి
- మృదు కణజాలం, స్థూలకోణ కణజాలం, దృఢ కణజాలం మొదలైనవి మరియు వాటి వ్యవస్థాపన స్పష్టంగా కనబడుతుంది.
·
బాహ్యచర్మం / ఉపచర్మ కణజాలం, దారు–పోషక కణజాల సమూహం వంటి భాగాలు గుర్తించవచ్చు;
ఫలితం (Result):
లేత మొక్క కాండం లో ఉన్న వివిధ శాశ్వత కణజాలాలు — వాటి కణ నిర్మాణం మరియు వ్యవస్థ ను స్పష్టంగా గుర్తించవచ్చు.
లేదా
B) విభాజ్య కణజాలం (Meristematic tissue) అంటే ఏమిటి? రకాలు, స్థానం, విధులు వ్రాయండి.
- మొక్కలలో పెరుగుదల కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలలో మాత్రమే జరుగుతుంది.
- ఆ ప్రాంతాలలో ఉండే విభజన చెందే కణజాలం ను విభాజ్య కణజాలము అంటారు.
- విభాజ్య కణజాలం నుండి కొత్తకణాలు ఏర్పడి తరువాత ఇతర కణజాలాలుగా మారతాయి.
విభాజ్య కణజాల రకాలు,
స్థానం,
విధులు
1)
అగ్రవిభాజ్య కణజాలం
స్థానం: మొక్క పెరిగే అగ్రభాగం వద్ద ఉంటుంది.
విధులు: మొక్క పెరుగుదల కు కారణమవుతుంది.
2)
మధ్యస్థ విభాజ్య కణజాలం
స్థానం: మొక్క మధ్య భాగాలలో ఉంటుంది.
విధులు: మొక్క భాగాల పొడవు పెరుగుదల లో సహాయపడుతుంది.
3)
పార్శ్వ విభాజ్య కణజాలం
స్థానం: మొక్కల పక్క భాగాలలో ఉంటుంది.
విధులు: వెడల్పు పెరుగుదల (secondary
growth) లో సహాయపడుతుంది.